మైగ్రేన్‌ బాధితులకు శుభవార్త ! 

28 Nov, 2019 09:12 IST|Sakshi

మైగ్రేన్‌ తలనొప్పి ఎంతగా బాధపెడుతుందో అనుభవించేవారికి మాత్రమే తెలుసు.ప్రాణాంతకం కాకపోయినా... అది వచ్చిందంటే మాత్రం విద్యార్థులైతే చదువునూ, పనిచేసేవారైతే వాళ్ల పనినీ తీవ్రంగా ఆటంకపరుస్తుంది. అలాంటి మైగ్రేన్‌ బాధితులందరికీ ఇది ఒక శుభవార్తే. వాళ్ల కోసం లాస్మిడిటాన్‌ అనే మందు యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీయే) ఆమోదం పొందింది. కాకపోతే లాస్మిడిటాన్‌ మందు వాడాక కనీసం 8 గంటల పాటు డ్రైవ్‌ చేయకూడదు. అదొక్కటే ఈ మందుతో ఉన్న ఇబ్బంది. ఇక త్వరలోనే మరో కొత్త ఔషధం కూడా అందుబాటులోకి రాబోతోంది. ట్రయల్స్‌ ముగించుకొని త్వరలో అందుబాటులోకి రానున్న ఈ కొత్త మందు పేరే ‘ఉబ్రోజపాంట్‌’. 

ప్రస్తుతం మైగ్రేన్‌కు వాడుతున్న మందులు... రక్తనాళాలను కాస్తంత సన్నబరిచేలా చేసి, బాధ ఉన్న చోట రక్తం ఒకింత తక్కువ అందేలా చేయడం ద్వారా పనిచేస్తాయి. కానీ ఇలాంటి చికిత్స గుండెజబ్బులు / రక్తనాళాలకు సంబంధించిన వాస్కు్కలార్‌ జబ్బులు ఉన్నవారికి అంత మంచిది కాదు. అలాంటివారిలో అది గుండెపోటు లేదా పక్షవాతానికి కారణం కావచ్చు. కానీ లాస్మిడిటన్, ఉబ్రోజపాంట్‌ అలా కాదు. తలనొప్పికి కారణమవుతుందని భావిస్తున్న ప్రోటీన్‌ను టార్గెట్‌ చేస్తాయి. నొప్పి కలిగించే ఆ ప్రోటీన్‌పై దాడి చేయడం ద్వారా వారి తలనొప్పిని, ఇతర ఇబ్బందులను  అరికడతాయి. న్యూయార్క్‌లోని మోంటెఫోయిర్‌ హెడేక్‌ సెంటర్‌లో ఆధ్వర్యంలో ట్రయల్స్‌లో ఉన్న ఉబ్రోజపాంట్‌ మందు గురించిన వివరాలు ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ ‘జామా’లో ప్రచురితమయ్యాయి. ఇది కూడా అందుబాటులోకి  మైగ్రేన్‌ రోగులకు ఎంతగానో వెలుసుబాటు కలుగుతుంది.  

మరిన్ని వార్తలు