బాదమ్‌ బర్ఫీ

30 Apr, 2018 00:02 IST|Sakshi

కుకింగ్‌

కావలసినవి: బాదంపప్పు – కప్పు; చక్కెర – 1 1/4 కప్పు; నెయ్యి – 1/4 కప్పు ( 6 టేబుల్‌ స్పూన్లు); పాలు – 1/4 కప్పు; పిస్తా – గార్నిష్‌కి సరిపడా.

తయారీ: బాదంపప్పులను కొద్దిసేపు వేడినీళ్ళలో నానబెటì ్ట తరవాత పొట్టు తీయాలి. తరవాత దానిని పాలతో కలిపి మెత్తగా గ్రైండ్‌ చెయ్యాలి. ఒక పాన్‌ తీసుకొని పంచదార, కొద్దిగా నీరు పోసి తీగ పాకం పట్టాలి.  గ్రైండ్‌ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్‌ని పాకంలో వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. అది దగ్గరకి వస్తుండగా కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ బాగా కలపాలి. ఈలోగా ఒక స్టీల్‌ ప్లేట్‌ తీసుకుని దానికి నెయ్యి రాసి పక్కన ఉంచుకోవాలి. బాగా ఉడికి విడివిడిలాడుతుండగా దింపేయాలి. వెంటనే ప్లేట్‌ మీద కొద్దిగా మందంగా ఈ మిశ్రమాన్ని వేయాలి. అది గట్టిపడుతుండగా మీకు కావలసిన షేప్‌లో కట్‌ చేయాలి. చివరగా బాదం, పిస్తా పలుకులతో గార్నిష్‌ చేయాలి.  

మరిన్ని వార్తలు