గొప్పింటి కష్టాలు

15 Mar, 2018 00:03 IST|Sakshi

సెటైర్‌ 

మహిళా క్రికెటర్‌లు ఎప్పుడో ఆడి గెలిచిన  ఆటకు ఇప్పుడాయన ట్వీట్‌ చేశారని ఉమెన్‌ ప్లేయర్స్‌  హర్ట్‌ అవడంతో అమితాబ్‌ ‘సారీ’ చెప్పాల్సి వచ్చింది.

బచన్స్‌ ఫ్యామిలీకి గ్రహాలు ఫర్‌గా ఉన్నట్లు లేవు! శ్రీదేవి చనిపోడానికి కొన్ని గంటల ముందు అమితాబ్‌ బచన్‌ ట్విట్టర్‌లో తాత్వికంగా.. ‘ఏదో జరగబోతోందని నా మనసుకు అనిపిస్తోంది’అని చిన్న ట్వీట్‌ పడేయడం పెద్ద టాపిక్‌ అయింది! అదయ్యాక.. ‘కంగ్రాట్స్‌.. ఉమెన్‌ క్రికెట్‌ చాంపియన్స్‌’ అని ఆయన ట్వీట్‌ చెయ్యడం కూడా ఇష్యూ అయింది. మహిళా క్రికెటర్‌లు ఎప్పుడో ఆడి గెలిచిన ఆటకు ఇప్పుడాయన ట్వీట్‌ చేశారని ఉమెన్‌ ప్లేయర్స్‌ హర్ట్‌ అవడంతో అమితాబ్‌ ‘సారీ’ చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన చుట్టూ డాక్టర్లు ఉన్నారు! షూటింగ్‌లో కాస్ట్యూమ్స్‌ బరువు ఎక్కువై ఆయనకు నెక్‌ పెయిన్, బ్యాక్‌పెయిన్‌ వచ్చి ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. ఇక ఇక్కడ పాలిటిక్స్‌లో ఆయన భార్య జయాబచన్‌ కూడా ఉత్తి పుణ్యానికి మాటలు పడాల్సి వస్తోంది! సమాజ్‌వాదీ పార్టీలోంచి బీజేపీలోకి వెళ్తూ వెళ్తూ నరేశ్‌ అగర్వాల్‌ అనే ఆయన.. ‘డాన్స్‌ చేసుకునేవాళ్లతో నాకెందుకు పోటీ’ అని కామెంట్‌ చేసి మరీ వెళ్లాడు! జయ కారణంగానే తనకు రాజ్యసభ టిక్కెట్‌ రాలేదని ఆయన ఉక్రోషం. ఆ కామెంట్‌కు జయ హర్ట్‌ అవలేదు. రియాక్ట్‌ అవలేదు. 

ఆ తర్వాత సేమ్‌పార్టీ లీడర్‌ అమర్‌సింగ్‌ జయను కామెంట్‌ చేశారు. ఆమెకు మాస్‌ ఫాలోయింగ్‌ లేదట. జనంలో కలవలేదట. హోప్‌లెస్‌ అట. జయ పలక పట్టుకున్న స్కూల్‌ పిల్లలా టైమ్‌కి రాజ్యసభకు వచ్చి, లాంగ్‌ బెల్‌ కొట్టగానే ఎక్కడా ఆగకుండా ఇంటికి వెళ్లిపోతుందట. ఆమె కంటే హేమమాలిని చాలా బెటర్‌ అట. ఈ మాటలకు కూడా జయ రియాక్ట్‌ కాలేదు. ఇక అభిషేక్, ఐశ్వర్యలు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో లోకానికి తెలియడం లేదు. వాళ్లిద్దరి పెళ్లికి ముందు అమితాబ్‌ ఫ్యామిలీ పెద్ద హోమం చేసింది. అలాంటి హోమం ఏదైనా మళ్లీ జరిగితే తప్ప ఈ పెద్దింటి వారికి చిన్నచిన్న చికాకులు తప్పేలా లేవు. 

మరిన్ని వార్తలు