గుడ్డు అదే ఆమ్లెట్‌ ఇది

3 Feb, 2018 00:25 IST|Sakshi
ఆమ్లెట్‌

గుడ్డు చూసినప్పటి నుంచి ఆమ్లెట్‌ను చూస్తూనే ఉన్నాం. కోడి ముందా? గుడ్డు ముందా? అంటే ఆమ్లెట్టే ముందు అని చెప్పాం. అంత సుపరిచితమైన ఆమ్లెట్లలో సూపర్‌ రుచివంతమైన ఆమ్లెట్లు ఇవి.

మష్రూమ్‌ ఆమ్లెట్‌
కావలసినవి: అన్‌సాల్టెడ్‌ బటర్‌ – 2 టీ స్పూన్లు, బటన్‌ మష్రూమ్స్‌ (చిన్న పుట్ట గొడుగులు) – అర కప్పు (నీళ్లలో శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి), కోడి గుడ్లు – 2 (లేదా నాలుగు తెల్ల సొనలు), నీళ్లు – 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత, మిరియాల పొడి / కారం– కొద్దిగా, చీజ్‌ తురుము – టేబుల్‌ స్పూను

తయారి: ∙పెనం స్టౌ మీద పెట్టి, టీ స్పూను అన్‌సాల్టెడ్‌ బటర్‌ వేసి కరిగించాలి ∙సన్నగా తరిగిన మష్రూమ్స్‌ని వేసి వేయించాలి ∙ఉప్పు, మిరియాల పొడి/కారం జత చేసి దోరగా వేయించి, ఒక ప్లేట్‌లోకి తీసుకుని మూత పెట్టి, పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో కోడి గుడ్లు, నీళ్లు వేసి బాగా గిలకొట్టాక, ఉప్పు, మిరియాల పొడి జత చేసి బాగా కలపాలి ∙పెనం మీద బటర్‌ వేసి పెనమంతా పరుచుకునేలా చేయాలి ∙బాగా కాగాక... గిలకొట్టిన కోడిగుడ్డు మిశ్రమం వేసి పెనం మీద సమానంగా పరవాలి ∙బాగా ఉడికిన తరవాత, వేయించి ఉంచుకున్న మష్రూమ్‌ ముక్కల మిశ్రమాన్ని ఆమ్లెట్‌ మీద సమానంగా వేయాలి ∙మధ్యకు మడతపెట్టి ప్లేట్‌లోకి తీసుకోవాలి ∙సన్నగా తురిమిన చీజ్‌ను పైన చల్లి అందించాలి.

పీనట్‌ చికెన్‌ ఆమ్లెట్‌ రోల్స్‌
కావలసినవి: కోడి గుడ్డు – 1, నీళ్లు – టేబుల్‌ స్పూను, ఆలివ్‌ ఆయిల్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, స్వీట్‌ చిల్లీ సాస్‌ – టేబుల్‌ స్పూను, జ్యూస్‌ అండ్‌ ఫిష్‌ సాస్‌ – టీ స్పూను, చికెన్‌ ముక్కలు – అర కప్పు, ఉడికించిన బఠాణీ  + క్యారట్‌ ముక్కలు – కప్పు, కీరా తురుము – పావు కప్పు, మిరియాల పొడి – టీ స్పూను, పుదీనా ఆకులు – గుప్పెడు, ఉల్లి కాడల తరుగు – పావు కప్పు, ఉప్పు – తగినంత, పీనట్స్‌ సాస్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర కాడలు – తగినన్ని

తయారి: ∙ఒక పాత్రలో కోడిగుడ్డు, టేబుల్‌ స్పూను నీళ్లు, ఉప్పు చేసి బాగా గిలకొట్టాలి ∙సన్నటి మంట మీద పాన్‌ వేడయ్యాక ఆలివ్‌ ఆయిల్‌ వేసి కాగాక, గిలకొట్టిన కోడిగుడ్డు మిశ్రమం వేసి, ఆమ్లెట్‌ కొద్దిగా మందంగా వచ్చేలా జాగ్రత్తపడాలి ∙బాగా కాలిన తరవాత ఆమ్లెట్‌ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙ఒక పాత్రలో స్వీట్‌ చిల్లీ సాస్, జ్యూస్‌ అండ్‌ ఫిష్‌ సాస్‌ వేసి కలపాలి ∙బాణలిలో నూనె కాగాక చికెన్, మిరియాల పొడి, ఉప్పు వేసి వేయించాక, తయారుచేసి ఉంచుకున్న స్వీట్‌ చిల్లీ సాస్‌ మిశ్రమం జత చేయాలి ∙ఆమ్లెట్‌ మీద ఉడికించిన కూరల తరుగు, చికెన్‌ మిశ్రమం సమానంగా పరిచి, పుదీనా ఆకులు ఉంచి, రోల్‌ చేయాలి  కొత్తిమీర కాడలతో ముడి వేసి, పీనట్స్‌ సాస్‌తో అందించాలి.

స్వీట్‌ ఫ్రూట్‌ ఆమ్లెట్‌
కావలసినవి: కోడి గుడ్లు – 2 (తెల్ల సొన మాత్రమే), పంచదార  పొడి – టేబుల్‌ స్పూను, నీళ్లు – టేబుల్‌ స్పూను, అన్‌సాల్టెడ్‌ బటర్‌ – టేబుల్‌ స్పూను, అరటి పండు ముక్కలు – అర కప్పు, ఆపిల్‌ ముక్కలు –  పావు కప్పు, స్ట్రా బెర్రీలు – 4 (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి), తేనె – కొద్దిగా

తయారి: ∙ఒక పాత్రలో తెల్ల సొనలు, పంచదార పొడి, నీళ్లు వేసి బాగా గిలకొట్టి పక్కన ఉంచాలి ∙మరో పాత్రలో పండ్ల ముక్కలు, తేనె వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద పెనం పెట్టి, వేడయ్యాక బటర్‌ వేసి పెనం మీద అంతా పరచాలి ∙గిలకొట్టిన కోడి గుడ్డు మిశ్రమం వేసి బాగా కాలనివ్వాలి ∙రెండవ వైపు కూడా కాలాక, ఆమ్లెట్‌ను ప్లేట్లోకి తీసి, పండ్ల ముక్కల మిశ్రమం వేసి, ఆమ్లెట్‌ను మధ్యకు మడిచి, వెంటనే అందించాలి.

ప్రాన్స్‌ ఆమ్లెట్‌
కావలసినవి: ఉల్లి తరుగు – పావు కప్పు, వెల్లుల్లి రేకలు – 1 (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి), క్యాప్సికమ్‌ తరుగు – టేబుల్‌ స్పూను, రొయ్యలు – 12 (శు్ర¿¶ ం చేయాలి), కోడి గుడ్లు – 5, నీళ్లు – టేబుల్‌ స్పూను, పాలు – కప్పు, కరివేపాకు పొడి – టీ స్పూను, ఉప్పు – తగినంత, మిరప పొడి – టీ స్పూను, మిరియాల పొడి – తగినంత, ఆలివ్‌ ఆయిల్‌ – టేబుల్‌ స్పూను, చీజ్‌ తురుము – 3 టేబుల్‌ స్పూన్లు, టొమాటో తరుగు – అర కప్పు

తయారి:  ∙బాణలిలో ఆలివ్‌ ఆయిల్‌ వేసి కాగాక, ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు వేసి దోరగా వేగాక, రొయ్యలు, తగినంత ఉప్పు, మిరప పొడి జత చేసి మరోమారు వేయించాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి దగ్గర పడే వరకు ఉడికించి, తీసేయాలి ∙ఒక పాత్రలో కోడి గుడ్లు వేసి గిలకొట్టాక, పాలు, కరివేపాకు పొడి, ఉప్పు, మిరియాల పొడి జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక ఆలివ్‌ ఆయిల్‌ వేసి కాగాక, కలిపి ఉంచుకున్న కోడి గుడ్ల మిశ్రమం వేయాలి ∙బాగా కాలిన తరవాత చీజ్‌ తురుము, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్‌ తరుగు, తయారుచేసి ఉంచుకున్న రొయ్యల మిశ్రమం వేసి ఆమ్లెట్‌ను మధ్యకు మడిచి అందించాలి.

స్టఫ్‌డ్‌ ఆమ్లెట్‌
కావలసినవి: ఆలివ్‌ ఆయిల్‌ – టీ స్పూను, రెడ్‌ క్యాప్సికమ్‌ తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు (సన్నగా పొడవుగా తరగాలి), ఉల్లి తరుగు – టేబుల్‌ స్పూను, చిన్న మెంతి కూర ఆకులు – కప్పు, జీడిపప్పు ముక్కలు – టేబుల్‌ స్పూను, కోడి గుడ్లు – 2, నీళ్లు – టేబుల్‌ స్పూను, ఉప్పు – తగినంత, మిరియాల పొడి / కారం – తగినంత, చీజ్‌ – టేబుల్‌ స్పూను.

తయారి: ∙స్టౌ మీద పెనం ఉంచి ఆలివ్‌ ఆయిల్‌ వేసి, సన్న మంట మీద కాగనివ్వాలి ∙రెడ్‌ క్యాప్సికమ్‌ తరుగు, ఉల్లి తరుగు, జీడి పప్పు ముక్కలు వేసి ఆపకుండా కలుపుతూ, దోరగా వేయించాలి ∙రెండు నిమిషాల తరవాత మెంతి కూర జత చేసి, పచ్చి వాసన పోయేవరకు వేయించి తీసేయాలి ∙ఒక పాత్రలో కోడి గుడ్లు, టేబుల్‌ స్పూను నీళ్లు వేసి బాగా గిలకొట్టాలి ∙ఉప్పు, మిరియాల పొడి / కారం పొడి జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙స్టౌ మీద పెనం వేడి చేసి, చీజ్‌ వేసి, కరిగించాలి ∙గిలకొట్టిన కోడిగుడ్డు మి్రÔ¶ మాన్ని వేసి, సమానంగా పరవాలి ∙బాగా కాలిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న స్టఫ్‌ను వేసి, ఆమ్లెట్‌ మీద సగ భాగం వరకు సర్ది మధ్యకు మడత వేయాలి ∙పైన చీజ్‌ తురుము వేసి, వెంటనే అందించాలి. 

మరిన్ని వార్తలు