తినండి... తగ్గండి తింటూనే... తగ్గండి!

12 Dec, 2016 15:03 IST|Sakshi
తినండి... తగ్గండి తింటూనే... తగ్గండి!

బాగా లావున్న వారు తమ బరువును తగ్గించుకోడానికి చాలా ఆసక్తి చూపుతారు. కానీ నోరు కట్టేసుకోవడం వారికి సాధ్యం కాదు. అయితే ఒక పక్క రోజూ తినేంత తింటూనే... ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి అవసరమైన మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. ఇలాంటి తాపత్రయంతో ఉన్నవారి కోసం అనేక రకాల పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇటీవలే కొంతకాలం క్రితం  యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు కూడా ఈ దిశలో తమ పరిశోధనలు కొనసాగించారు. ఇష్టమైనవి తింటూనే బరువు తగ్గడం లేదా మరింత బరువు పెరగకుండా ఉండటం ఎలాగో తెలుసుకున్నారు.

నీటి పాళ్లు ఎక్కువగా ఉండే  కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల సత్వరం బరువు పెరగడం జరగదని గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన నిపుణులు చెబుతున్న దాని ప్రకారం... కూరగాయలు, ఆకుకూరల్లో క్యాబేజీ, కాలీఫ్లవర్, దబ్బపండు, లెట్యూస్, ముల్లంగి, పాలకూర... వీటిలో నీటి పాళ్లు ఎక్కువ. ఇవి తీసుకుంటే ఒక పట్టాన బరువు పెరగడం సాధ్యం కాదు. వీటిలో నీటిపాళ్లు ఎక్కువ అయినందున వీటిని తినగానే కడుపులో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. అందుకే బరువు పెరగకుండా ఉండాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు విధిగా పై కూరలను తమ ఆహారంలో ఉండేలా చూసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు ఆ నిపుణులు.

మరిన్ని వార్తలు