స్ప్రింగ్‌రోల్‌ నూడుల్స్‌

20 Oct, 2018 00:22 IST|Sakshi

కావలసినవి:వెర్మిసెల్లి నూడుల్స్‌ – ఒక ప్యాకెట్‌ (సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతాయి); నూనె – 2 టీ స్పూన్లు;వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను; క్యారట్‌ తురుము – ఒక కప్పు (నూడుల్స్‌లాగే పొడవుగా తురమాలి); ఉల్లి కాడల తరుగు – 2 టేబుల్‌ స్పూన్లుక్యాబేజీ తరుగు – 2 కప్పులు; పంచదార – పావు టీ స్పూను; సోయా సాస్‌ – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత స్ప్రింగ్‌ రోల్‌ షీట్లు – 7; మిరియాల పొడి – అర టీ స్పూను; కార్న్‌ ఫ్లోర్‌ – ఒక టీ స్పూను; నీళ్లు – 2 టేబుల్‌ స్పూన్లు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ :ఒక పెద్ద పాత్రలో వేడి వేడి నీళ్లు పోసి, అందులో వెర్మిసెల్లి నూడుల్స్‌ను మధ్యకు విరిచి వేసి అరగంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి అందులో 2 టీ స్పూన్ల నూనె వేసి కాగాక వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఉల్లికాడల తరుగు జత చేసి మరోమారు వేయించాలి. క్యాబేజీ తరుగు, క్యారట్‌ తరుగు కూడా జత చేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి. (మరీ ఎక్కువ ఉడికించకూడదు)  సోయా సాస్, పంచదార, ఉప్పు, మిరియాల పొడి జత చేసి మరోమారు బాగా కలపాలి. నీళ్లలో నుంచి వెర్మిసెల్లి బయటకు తీసి, ఉడుకుతున్న క్యాబేజీ మిశ్రమంలో వేసి బాగా కలపాలి.  చిన్న పాత్రలో కొద్దిగా నీరు, కార్న్‌ఫ్లోర్‌ వేసి మెత్తగా కలిపి, నూడుల్స్‌లో వేసి బాగా కలిపితే స్టఫింగ్‌ సిద్ధమైనట్లే ∙కొద్దిగా స్టఫింగ్‌ మిశ్రమం తీసుకుని, స్ప్రింగ్‌ రోల్‌ షీట్‌ మీద ఉంచి, రోల్‌ చేసి పక్కన ఉంచుకోవాలి  స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న రోల్స్‌ను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు