అమర్‌నాథ్‌ యాత్ర

1 Apr, 2017 00:17 IST|Sakshi
అమర్‌నాథ్‌ యాత్ర

కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు 145 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో అమర్‌నాథ్‌ గుహలో భక్తులకు దర్శనమిస్తాడు భోళా శంకరుడు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గుహల్లో ఒకటి. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవున్న గుహ ఇది. హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా, సహజసిద్ధంగా ఏర్పడిన గుహ ఇది. ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా ఈ గుహ పూర్తిగా మంచు కప్పుకుని ఉంటుంది. ఆ సమయంలో మైనస్‌ 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇలాంటప్పుడు గుహను చేరుకోవటం అసాధ్యం.

జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది. మంచు కరుగుతుంటుంది. దీంతో గుహ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగే ఉంటుంది. 45 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా కరిగి అంతర్థానమవుతుంది. విచిత్ర మేమంటే గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుంది. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తుంది.. అదే శివ మహత్యం అంటుంటారు భక్తులు.

అమర్‌నాథ్‌ యాత్రలో RV టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌
  ఇది మామూలు ప్రయాణం కాదు. ఓ వైపు అత్యంత లోతైన లోయలు, ఇరుకు దారులు, గుర్రాలపై తప్ప వెళ్లలేని ప్రయాణం. అయినా భక్తులు అంత దూరం వెళ్లటానికి సంకోచించరు. అదంతా కేవలం పార్వతీ ప్రియ వల్లభుడిపై ఉన్న భక్తి, కొండంత నమ్మకం.

క్షణంలో మారే వాతావరణం
 ప్రపంచంలోనే అత్యంత కష్టమైన యాత్రల్లో ఒకటిగా పేరొందిన అమర్‌నాథ్‌ యాత్రకు ఏయేటికాయేడు భక్తులు భారీగా పెరుగుతున్నారు.  యాత్రకు వెళ్లే వారు చలి నుంచి రక్షణ కోసం మంకీ క్యాప్‌లు, స్వెట్టర్లు, జర్కిన్లు, బ్లౌజ్‌లు, షూ తప్పని సరి. ఎందుకంటే... అక్కడ వాతావరణం క్షణాల్లో మారుతుంది. అప్పటికప్పుడే వర్షం పడి కొండ చరియలు విరిగిపడతాయి. దారి మూసుకు పోతుంది. కాళ్లు జారుతూ ఉంటాయి. అందుకే చేతిలో కర్ర, టార్చ్‌లైట్‌ ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి.

మరిన్ని వార్తలు