అమర్‌నాథ్‌ యాత్ర

8 Apr, 2017 00:17 IST|Sakshi
అమర్‌నాథ్‌ యాత్ర

మంచుకొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది. చుట్టూ ఎత్తయిన కొండలు.. కిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు.. పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్‌ అందనంత ప్రమాదకరమైన వాతావరణం. మైనస్‌ డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి.. ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపై ఆశ ఉండదు. అంతటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం అందరినీ ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్తోంది. ఒకే ఒక్క మంత్రం దుర్భర వాతావరణాన్ని సానుకూలంగా మార్చేస్తుంది.

అదే ఓం నమఃశివాయ. శివ పంచాక్షరి మంత్రం. ఏడాదిలో కేవలం 45రోజుల పాటు కనిపించే మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన అదే అమర్‌నాథ్‌ యాత్ర. ప్రపంచంలోనే అతి కష్టమైన యాత్ర అమర్‌నాథ్‌ యాత్ర. తిరిగి వస్తామో, రామో అన్న భయం. ఇరుకైన దారి... ఇరుపక్కలా లోయలు.. కళ్లు తెరిస్తే ఎక్కడ పడిపోతామో అన్నంత భయం.. తెరవకపోతే ఎలా వెళ్తున్నామో తెలియని అయోమయం.. ఒక్క మాటలో చెప్పాలంటే.. మృత్యువు మన వెనకే నడుస్తుంటే... దాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగడమే వెళ్లటమే అమర్‌నాథ్‌ యాత్ర.

అమర్‌నాథ్‌ గుహ ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా పూర్తిగా మంచు కప్పుకుని ఉంటుంది.. ఆ సమయంలో గుహను చేరుకోవటం అసాధ్యం... జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది.. మంచు విచ్చుకుంటుంది.. గుహ స్పష్టంగా కనిపిస్తుంది.. కానీ, శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగే ఉంటుంది.. అందువల్లే 45 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది.. విచిత్రమేమంటే గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుంది.. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తుంది? అదే శివ మహత్యం అంటుంటారు భక్తులు. ఏడాదంతా గడ్డకట్టుకుపోయిన అమర్‌నాథ్‌ గుహ క్రమంగా తేటపడుతున్న సమయంలో జ్యోతిర్లింగం ఏర్పడే చోట గుహ పైభాగం నుంచి ఒక్కొక్కటిగా నీటి చుక్క కింద పడుతూ ఉంటుంది.  సుమారు 45 రోజుల పాటు ఈ నీటిబొట్లు పడుతూనే ఉంటాయి. ఈ నీటి బొట్లు క్రమంగా మంచుగా మారి, లింగరూపంగా రూపాంతరం చెందుతుంది.

ఏడాదిలో రెండు నెలలు మాత్రమే తెరిచి ఉండే ఈ గుహకు వెళ్లడానికి ఎన్నో వ్యయప్రయాసలు చేయాల్సిందే. ఇది మామూలు ప్రయాణం కాదు.. ఇదెంతో కష్టంతో కూడుకున్న ప్రయాణమని తెలిసినా... అంత దూరం వెళ్లటానికి ఎవరూ సంకోచించరు.... సరికదా... మరింత ఉత్సాహంతో  అమర్‌నాథ్‌ యాత్రకు అపూర్వంగా, అపురూపంగా వెళ్తుంటారు భక్తులు. అదంతా కేవలం పార్వతీ ప్రియ వల్లభుడిపై ఉన్న భక్తిభావం. కొండంత నమ్మకం.మొత్తానికి మంచుకొండల్లో మహాదేవుని దర్శనం అనితర సాధ్యం. ఎంతో శ్రమిస్తే తప్ప ఆయన దర్శనం లభించదు.. లయకారకుడి నిజరూపాన్ని కళ్లారా చూసి తరించి... తన్మయత్వం చెంది... తనవి తీరా ఆ రూపాన్ని గుండెల్లో భద్రంగా పెట్టుకుంటారు భక్తులు.

అమర్‌నాథ్‌ యాత్రలో RV టూర్స్‌ – ట్రావెల్స్‌ ప్రస్థానం
ఎన్ని యాత్రలు చేసినా... ఎన్ని పర్యాటక ప్రాంతాలు తిరిగినా యాత్రికుల క్షేమమనేది ప్రధాన ఉద్దేశంతో, సేవే లక్ష్యం... ప్రేమే మార్గంగా మొదలైన RV టూర్స్‌ – ట్రావెల్స్‌. యాత్రికులకు పుణ్యక్షేత్రాల సందర్శనతో జన్మ పునీతం చేయాలనుకునే సంకల్పంతో ప్రారంభమైన ప్రయాణం. గత 16 సంవత్సరాలుగా నిరాటంకంగా అమర్‌నాథ్‌ యాత్రకు చిన్నా , పెద్దా వయస్సుతో నిమిత్తం లేకుండా ఎన్నో వేలమంది ప్రయాణికులకు గమ్యస్థానంలో  ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఒక్కరిని తన కంటికి రెప్పలా కాపాడుకుంటూ యాత్రికులు కోరుకున్న విధంగా యాత్రలను ఏర్పాటు చేయడం ఒక ఎత్తయితే,  యాత్రికులకు ఎవ్వరూ ఇవ్వని విధంగా ప్రత్యేక సదుపాయాలను అందిస్తూ మరీ ముఖ్యంగా  యాత్రికులకు తెలుగు భోజనం మంచి వసతి సౌకర్యాలను కల్పించడంతో పాటు  తమ సంస్థ తరుపున ఒక్కో బందానికి ఒక్కో టూర్‌ మేనేజర్‌ని నియమించి... యాత్రికులకు తాము చేసిన యాత్రను అజన్మాంతం ఓ మధురానుభూతిని కల్గిస్తూ తెలుగు వారి ఆత్మీయ ట్రావెల్స్‌గా తెలుగు ప్రజలందరి మదిలో సుస్థిరమైన స్థానం ఏర్పరుచుకుంది ఆర్‌వీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌.. ఎంతో మహిమాన్వితమైన అమర్‌నాథ్‌ యాత్రను మీరు కూడా RVటూర్స్‌ – ట్రావెల్స్‌ ద్వారా చేయనుకున్నట్లైతే మరిన్ని వివరాలకు హైదరాబాద్, కూకట్‌పల్లిలో , ఆఒ్క ఆఫీస్‌ ఎదురుగా ఉన్న RVటూర్స్‌ – ట్రావెల్స్‌ ఆఫీస్‌ను సంప్రదించి కానీ , ఫోన్‌ చేసి  కానీ వివరాలు తెలుసుకోవచ్చు.

మరిన్ని వార్తలు