అమ్మానాన్నలు సంతోషంగా ఉంటేనే...

9 Oct, 2017 00:40 IST|Sakshi

ఆత్మీయం

మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని శాస్త్రాలు చెప్పాయి. తల్లిదండ్రులే ప్రత్యక్షదేవతలని ప్రవచనాలలో వింటూ ఉంటాం. కానీ, తల్లిదండ్రులను పాతసామాన్ల గదిలోనో, పశువులపాకలోనో పడేసే పిల్లలు ఉన్నారు. అలాంటి వారిని ఏమనాలి? ఒక కుమారుడు కానీ, కుమార్తెకానీ ఈ శరీరంతో తిరుగాడుతున్నారంటే అందుకు కారకులైనది తల్లిదండ్రులే కదా, వారుండబట్టే కదా, ఈ భూమి మీదకు రాగలిగింది. ఆ విషయాన్ని విస్మరించి, నా తల్లిదండ్రులు నాకేమిచ్చారు, నేను వారికెందుకు కృతజ్ఞత చూపించాలి? ఎందుకని వారికి ఈ వయసులో సేవలు చేయడం, వారి అవసరాలు తీర్చడమెందుకు అనుకుని వారిని పూర్తిగా పనికిరాని వారిగా పక్కన పెడతారు. తేజస్సును, బ్రహ్మ స్వరూపంలో తేజస్సుగా, వీర్యంగా నిక్షేపించినవాడు కేవలం తండ్రి.

తన కన్నబిడ్డల శరీరానికి ఆధారమైన తల్లీ తండ్రి శరీరంతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా నమస్కరించాలి, లేకపోయినా నమస్కరించాలి. కృతజ్ఞులమై ఉండాలి. అలా లేనివారిని చూసి చూసి... పితృదేవతాస్వరూపంలో ఉన్న తల్లిదండ్రులు – అటువంటి సంతానాన్ని కన్నందుకు కుమిలిపోతారట. అయితే ఏమిటి? అనుకుంటారేమో, పితృదేవతలు సంతోషంగా లేకపోతే, ఈ లోకంలో మనం సంతోషంగా ఉండలేమట. అది గుర్తుపెట్టుకోవాలి.  

మరిన్ని వార్తలు