స్పాండిలైటిస్ - హోమియో చికిత్స

19 Jul, 2013 05:16 IST|Sakshi
స్పాండిలైటిస్ - హోమియో చికిత్స
జీవనవిధానంలో మార్పుల వల్ల ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెన్నెముకకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. మెడలో వెన్నెముక భాగంలో ఏడు పూసలు (డిస్క్) ఉంటాయి. ఈ డిస్క్‌ల మధ్యలో నరాలుంటాయి. నరాల మధ్య ఒత్తిడి పడటం వల్ల, నరాలు ఒత్తుకోవటం వల్ల మెడనొప్పి, నడుంనొప్పి వస్తుంటుంది. ఈ సమస్య ఎక్కువగా మధ్య వయసు (30-50) లో రావచ్చు. వయసు మీరిన తర్వాత కూడా స్పాండిలైటిస్ రావటానికి ఆస్కారం ఉంది.
 
 వెన్నెముక నిర్మాణంలో, డిస్క్‌ల అమరికలో తమ సహజ స్థితిని కోల్పోయి, డిస్క్‌ల మధ్య ఉన్న ఖాళీ తగ్గి, వెన్నెముక మధ్యలో ఉండే కణాస్థి (కార్టిలేజ్) నరాలపై ఒత్తిడి కలిగిస్తుంది. ఈ కార్టిలేజ్ వల్ల ఇది డిస్క్ మధ్య కుషన్‌లాగా పనిచేసి సాధారణ ఒత్తిళ్ళ వల్ల కలిగే బాధలను తగ్గిస్తుంది.
 
 డిస్క్‌లపై ఎక్కువగా ఒత్తిడి పడినప్పుడు మన భంగిమల్లో అసౌకర్యం కనిపిస్తుంది. దీనివల్ల మెడ, భుజాలు బిగుసుకొనిపోతాయి. సరైన భంగిమల్లో కూర్చోలేకపోవడం, ఎక్కువసేపు నిలబడటం, కూర్చోవటం వల్ల డిస్క్‌ల్లో మార్పులు వస్తాయి. కంప్యూటర్ ఉద్యోగులు, డైవింగ్ ఎక్కువగా చేసే వ్యక్తులు, ద్విచక్రవాహనాలు నడిపేవారు, అధిక బరువులు మోసేవారు ఈ వ్యాధికి గురవుతుంటారు.
 
 నడుమునొప్పి/ లంబార్ స్పాండిలైసిస్
 నడుము దగ్గర నొప్పి, నడుము పట్టినట్టుగా ఉండడం, కదిలితే నొప్పి, నిలబడలేకపోవటం, నడుము కింది భాగంలో బలహీనత, స్పర్శ తగ్గడం, కాళ్ళలో తిమ్మిరి వ్యాధి, నడవలేకపోవటం మొదలైన లక్షణాలు ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపిస్తాయి.
 
వ్యాధి నిర్థారణ: ఎక్స్‌రే సర్వికల్ స్పైన్, డాప్లర్ స్టడీ,
 
 ఉపశమన మార్గాలు: మెడపై ఒత్తిడిపడకుండా చూసుకోవటం, అవసరమైతే కాలర్ వాడటం, ప్రయాణాల్లో డిస్క్‌లపై ఒత్తిడి లేకుండా చూసుకోవటం, ఎత్తై ప్రదేశాలకు వెళ్ళినపుడు జాగ్రత్తలు తీసుకోవటం.
 
 హోమియో చికిత్స: మానసిక, శారీరక లక్షణాలపై ఆధారపడి, ఆధునిక హోమియో వైద్యచికిత్సలో ఈ సమస్య నుంచి సాంత్వన కలగచేయవచ్చు. సొంత వైద్యంతో సమస్యలు తెచ్చుకోకుండా హోమియో మందులు సరిగ్గా వాడితే స్పాండిలైటిస్ సమస్య మీ నుంచి దూరం అవుతుంది. హోమియోపతి మందులు సత్వర ఉపశమనానికి  తోడ్పడుతాయి. సరైన చికిత్సతో సరైన రీతిలో స్పాండిలైటిస్ బాధలు దూరమవుతాయి.
 
 లక్షణాలు
 మెడనొప్పి 
  తీవ్రమైన మెడనొప్పితో మెడ తిప్పలేకపోవడం
  నొప్పి మెడ నుంచి భుజాల వరకు పాకటం 
  చేతివేళ్ళ వరకు పాకడం 
  తిమ్మిరి 
  పట్టుకున్న వస్తువులు పడిపోవటం 
  తలనొప్పి
 
 ఈ వ్యాధి ముదిరితే చేతికి సంబంధించిన కండరాలు కృశించిపోతాయి. దీనివల్ల రక్తసరఫరాలో అంతరాయం ఏర్పడి జీవన్మరణ సమస్యగా మారే అవకాశం ఉంది.
 
 నా వెన్నునొప్పి తగ్గడానికి కారణం...
 నా పేరు బాలకృష్ణ. నేను డ్రైవర్‌ని. చాలాకాలం వెన్ను నొప్పితో బాధపడ్డాను. నా వృత్తిపరంగా ఎప్పుడూ కూర్చునే ఉండాలి. స్టీరింగ్ దగ్గర కూర్చున్న కొద్దిసేపటికే మెడనొప్పి, చేతులలో తిమ్మిర్లు, నడుమునొప్పి వచ్చేసేవి. చాలారోజులు డ్యూటీకి సెలవుపెట్టి ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగాను. అయినా లాభం లేకపోయింది. అటు డ్యూటీకి వెళ్ళలేక, ఇటు నడుంనొప్పి తగ్గక చాలా విసుగు చెందాను.
 
 అదే సమయంలో మా స్నేహితుడు చెప్పిన సలహామేరకు పాజిటివ్ హోమియోపతిని సంప్రదించాను. ఇక్కడి డాక్టర్లు నాకు తగిన మందును, సలహాలను ఇచ్చి నా ప్రాబ్లమ్‌ను పరిష్కరించారు. ఇప్పుడు నేను హ్యాపీగా డ్యూటీకి వెళ్తున్నాను. నా వెన్నునొప్పి తగ్గడానికి కారణమైన పాజిటివ్ హోమియోపతి వారికి నా ధన్యవాదాలు.
 
మరిన్ని వార్తలు