స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకున్నాను!

1 Oct, 2014 23:04 IST|Sakshi
స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకున్నాను!

 - అపూర్వి చండేలా, షూటర్
 
 చిన్నప్పటి నుంచి ఆటలు అంటే చాలా ఇష్టం. బాస్కెట్ బాల్ బాగా  ఆడేదాన్ని. స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకునేదాన్ని.
 
 అభినవ్ బింద్రా ఒలింపిక్ గోల్డ్ గెలుచుకున్న తరువాత అది చాలామందిలో స్ఫూర్తి నింపింది. అందులో నేను కూడా ఒకరిని. షూటర్ కావాలనుకోవడానికి ఇదే కారణం.
 
 నా తల్లిదండ్రులు తమ కోరికలను నా మీద ఎప్పుడూ రుద్దలేదు. అభిరుచికి తగిన స్వేచ్ఛను ఇచ్చారు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకోవడానికి ఆ ప్రోత్సాహమే వెన్నుదన్నుగా నిలచింది.
 
 కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలుచుకోవడం నా జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పింది. అది మాటలకు అందని అద్భుత భావన. నా  ఫస్ట్ నేషనల్ టైటిల్‌ను 2012లో గెలుచుకున్నాను. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం నా లక్ష్యం... ఒలింపిక్స్‌లో క్వాలిఫై కావడం.
 
 రోజూ యోగా, ధ్యానం చేస్తాను. చాలా దూరం పరుగెడతాను.
 
 ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఏమాత్రం వీలున్నా కొత్త ప్రదేశాలు చూడడానికి ప్రాధాన్యత ఇస్తాను.
 

మరిన్ని వార్తలు