శ్రీ మహాలక్ష్మీదేవి

6 Oct, 2016 23:05 IST|Sakshi
శ్రీ మహాలక్ష్మీదేవి

ఏడవ రోజు శుక్రవారం  అలంకారం

 

ఈరోజు అమ్మవారిని త్రిశక్తి స్వరూపాలలో ధనాధిష్ఠాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మిగా అలంకరిస్తారు. జగత్కల్యాణ స్థితికారిణి అయిన అమ్మ ధనధాన్యధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజ లక్ష్ములుగా అష్ట సిద్ధులనూ ప్రసాదించే అమృత స్వరూపిణిగా, సురాసురులు పాలకడలిని చిలికినప్పుడు క్షీరాబ్ది కన్యకగా పుట్టిన వరాలతల్లి హాలుడు అను రాక్షసుణ్ణి సంహరించి మహాలక్ష్మిగా పేరుగాంచినట్లు ప్రతీతి. వరదాభయ హస్తాలతో కనకధారలు కురిపిస్తూ కమలాసనాసీనురాలై మహాలక్ష్మి రూపంలో దుర్గాదేవిని దర్శిస్తే సమస్త ఆర్థిక బాధలూ తొలగిపోయి సుఖసంతోషాలతో తులతూగుతారని నమ్మకం.

శ్లోకం:       పుత్రాన్ దేహి ధనం
దేహి సౌభాగ్యం దేహి సువ్రతే
అన్యాంశ్చ సర్వకామాంశ్చ
దేహి దేవి నమోస్తుతే!

 
భావం:      సౌభాగ్యం, సత్సంతానం, ధనధాన్యాదులు ఇచ్చి లోకాలను కాపాడు జగదంబా నీకు నమస్సులు.
నివేదన:    బెల్లం పాయసం, శనగలు
ఫలమ్:     ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అన్నివిధాలుగా పురోభివృద్ధి కలుగుతుంది.

 - దేశపతి అనంతశర్మ

 

మరిన్ని వార్తలు