దుస్తులపై మరకలు..

7 May, 2014 22:08 IST|Sakshi
దుస్తులపై మరకలు..

దుస్తులపై మరకలు..

దుస్తులపై నూనె మరకలు అయినచోట ఉప్పులో అద్దిన నిమ్మముక్కతో రుద్ది, తర్వాత డిటెర్జెంట్ సోప్‌తో శుభ్రపరచాలి.
     
ఎండబెట్టిన నిమ్మ తురుమును పొడి చేసి, గాలిచొరబడని జార్‌లో భద్రపరచాలి. తెల్లని దుస్తులను ఉతకడానికి డిటర్జెంట్‌తో పాటు ఈ పొడిని కొద్దిగా కలిపి నానబెట్టాలి. మురికి త్వరగా వదలడమే కాకుండా దుస్తులకు మెరుపులాంటి తెలుపుదనం వస్తుంది.
     
దుస్తులపై టీ మరకలు అయిన చోట చల్లని పాలలో ముంచిన స్పాంజితో రుద్ది, ఆరిన తర్వాత శుభ్రపరచాలి.
 
కంటికింద నలుపు...

చర్మం బిగుతు అవడానికి, తెల్లబడటానికి స్కిన్ టైటనింగ్, వైటనింగ్ క్రీమ్‌లను ముఖానికి వాడుతుంటారు. కాని కళ్ల కింద వాడలేరు. దీంతో కంటిచుట్టూ నల్లగా తయారవుతుంది. అందుకని రాత్రి, పగలు ఎలాంటి క్రీములు వాడినా ఫేసియల్ మాయిశ్చరైజర్‌ను కొద్దిగా చూపుడు వేలికి అద్దుకొని కంటి చుట్టూతా మృదువుగా రాయాలి. దీంతో కంటి చుట్టూ ఉన్న చర్మం లోపల రక్తప్రసరణ జరిగి, చర్మం పొడిబారడం తగ్గుతుంది. కంటిచుట్టూ చర్మం సున్నితంగా ఉంటుంది. అందుకని రాత్రిపూట మేకప్ నుంచి, ఇతరత్రా ఫేసియల్ ఉత్పత్తులనుంచి తగినంత విశ్రాంతిని కంటికి ఇవ్వాలి. ఈ జాగ్రత్తలు కంటికింద నలుపును దూరం చేస్తాయి.
 
గోరంత పని...

పెరిగిన గోళ్లను కత్తిరించడం, గోరు  చుట్టూ భాగాన్ని శుభ్రపరచడం వల్ల వేలికొసల్లో అందంగా కనిపిస్తాయి గోళ్లు.
 
గోరువెచ్చని సబ్బునీటితో చేతులను శుభ్రపరుచుకోవాలి.
 
క్యుటికల్ టూల్ సాయంతో గోరు చుట్టూ ఉన్న చిగుళ్లను శుభ్రపరచాలి.  చిన్న నెయిల్ క్లిప్పర్‌తో గోరు చుట్టూ ఉన్న క్యుటికల్స్, గోళ్లు కత్తిరించాలి.  యాంటిసెప్టిక్/ యాంటీబయోటిక్ క్రీమ్ ను గోళ్ల చుట్టూ రాయాలి.  ఆలివ్ ఆయిల్‌ని వేలికి అద్దుకుని, గోళ్లపై రాసి, మృదువుగా రబ్ చేయాలి.  వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే గోళ్లు ఆరోగ్యంగా పెరుగు తాయి.
 

మరిన్ని వార్తలు