నేను నేనే

29 Jan, 2020 00:58 IST|Sakshi

రెండు విషయాలు

లిసీప్రియా కంగుజం వయసు 8 ఏళ్లు. వాతావరణ కాలుష్యం నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించేందుకు కంకణం కట్టుకుంది. ఆ వయసుకు కంకణం అనేది పెద్ద మాటే కానీ.. లిసీప్రియా మాటల్ని వింటే అది చాలా చిన్నమాటగా అనిపిస్తుంది. లిసీ మణిపూర్‌ అమ్మాయి. గ్రెటా థన్‌బర్గ్‌లా ఈ భూగోళాన్ని కాలుష్యం నుంచి కాపాడే ఉద్యమాన్ని చేతుల్లోకి ప్లకార్డులా తీసుకుంది. దాంతో మీడియా ఆమెను ‘గ్రెటా థన్‌బర్గ్‌ ఆఫ్‌ ఇండియా’ అని కీర్తిస్తోంది.

ఇదే నచ్చడం లేదు లిసీకి! నాకో పేరు లేదా? నాకో వ్యక్తిత్వం లేదా? నాకో గుర్తింపు లేదా? అని మీడియాపై కోపగించుకుంటోంది ఆ చిన్నారి. ‘‘స్వీడన్‌ అమ్మాయి గ్రెటా 2019లో మాత్రమే క్లెయిమేట్‌ ఉద్యమం చేపట్టింది. నేను అంతకంటే ముందరే 2018 జూలై నుంచీ మన ప్రధానికి, దేశాధినేతలకు లేఖలు రాస్తున్నాను. కనుక ఇక నుంచీ నన్ను ‘గ్రెటా ఆఫ్‌ ఇండియా’ అని పిలవకండి’’అని ట్వీట్‌ పెట్టింది. ‘‘మా ఇద్దరి లక్ష్యాలూ ఒకటే అయినా నేను నేనే’’ అని కూడా అంది! చూస్తుంటే లిసీప్రియా గ్రెటాను మించిపోయేలా ఉంది.

మరిన్ని వార్తలు