ప్రయాణంలో చదవద్దు...

11 Feb, 2016 22:43 IST|Sakshi
ప్రయాణంలో చదవద్దు...

 ఎగ్జామ్ టిప్స్

పరీక్ష కేంద్రానికి కనీసం అరగంట ముందుగా చేరుకోవాలి. ఆదరాబాదరాగా వెళితే టెన్షన్ పెరిగి చదివింది మర్చిపోయే ప్రమాదముంది. ఎగ్జామినేషన్ సెంటర్‌కు వెళ్ళేటప్పుడు ఏమీ చదవకుండా, కేవలం పరీక్ష రాయడం మీదే దృష్టి నిలపడం మంచిది. లూజ్‌గా ఉండేవి, కాటన్ దుస్తులు మాత్రమే వేసుకుని వెళ్ళండి. లేకపోతే దుస్తుల కారణంగా చెమటలు పట్టి... జవాబు పత్రం ఖరాబు అయ్యే ప్రమాదం ఉంది.చిట్స్ తీసుకువెళ్ళడం, కాపీ కొట్టడం చేయవద్దు. ఎగ్జామ్ ఫెయిలవ్వడం కన్నా కొన్ని సంవత్సరాల పాటు డిబార్ అవడం అనేది మన కెరీర్‌కు మరింత ఎక్కువ నష్టం కలిగిస్తుందని మర్చిపోవద్దు. తడిపిన పెద్ద హ్యాండ్ కర్చీఫ్ లేదా వెట్ నాప్‌కిన్స్‌గాని తోడు తీసుకుని వెళితే మంచిది. దాంతో అపుడపుడు మొహం తుడుచుకుంటే... ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

జవాబులు రాసే హడావిడిలో... రోల్‌నెంబర్ రాయడం మర్చిపోవద్దు. {పశ్నాపత్రం పూర్తిగా చదవాలి. ఎక్కువ మార్కులు తెచ్చేవి, బాగా తెలిసిన ప్రశ్నలకు ముందు సమాధానాలు రాయండి.  ఒకే ప్రశ్నకు ఎక్కువ సమయం వృథా చేయకుండా, మీకున్న టైమ్‌ను ప్రశ్నలవారీగా చక్కగా విభజించుకుని జవాబులు రాయండి.  నిర్ణీత వ్యవధిలోపే జవాబులు రాసేస్తే...  పరీక్ష హాల్లో నుంచి బయటకు వచ్చేయకుండా... మిగిలిన టైమ్‌లో ఆన్సర్లను వీలైతే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.  ఇతరులను చూస్తూ కూర్చోవడం, వారితో మాట్లాడడం వంటివి మీ సమయాన్ని వృథా చేయడమే కాకుండా మీరు తప్పు చేస్తున్నారని ఇన్విజిలేటర్ భావించేలా చేస్తాయని గుర్తుంచుకోండి.

మరిన్ని వార్తలు