సెల్‌ఫోన్‌తో నిద్రిస్తున్నారా?

16 Dec, 2017 16:04 IST|Sakshi

కాలిఫోర్నియా : సెల్‌ఫోన్లను దూరంగా ఉంచకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ హెచ్చరించింది. సెల్‌ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్‌ కారణంగా క్యాన్సర్‌, వంధత్వం, మానసిక సమస్యలు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు హెచ్చుగా ఉన్నట్లు చెప్పింది.

మొబైల్‌ ఫోన్ల ద్వారా పెద్ద మొత్తంలో ఫైళ్లను డౌన్లోడ్‌ చేస్తున్నా.. స్ట్రీమింగ్‌(వీడియోలు చూస్తున్నా, ఆడియో వింటున్నా) విడుదల అయ్యే రేడియేషన్‌ పాళ్లు మామూలు సమయాలతో పోల్చితే అధికంగా ఉంటాయని వివరించింది. ఎక్కువ మంది సెల్‌ఫోన్‌తో నిద్రిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. నిద్రించే సమయాల్లో సెల్‌ఫోన్‌ను రెండు అడుగుల దూరంలో ఉంచడం మంచిదని పేర్కొంది.

ఇది ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదని చెప్పింది. చిన్నపిల్లలు రేడియేషన్‌కు ఎక్కువగా ప్రభావితమవుతారని తెలిపింది. పలు పరిశోధనలు సెల్‌ఫోన్‌ వాడటం వల్ల మెదడు, చెవులలో గడ్డలు ఏర్పడుతున్నాయని పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రైమరీ, మిడిల్‌ స్కూళ్లలో సెల్‌ఫోన్‌ల వినియోగాన్ని ఫ్రాన్స్‌ గత వారం నిషేధించింది. 

మరిన్ని వార్తలు