ఎక్కిళ్లు ఆగాలంటే...

30 Nov, 2014 22:50 IST|Sakshi
ఎక్కిళ్లు ఆగాలంటే...

ఎక్కిళ్లు రావడం సహజమే. అయితే ఒక్కోసారి ఎంతకీ తగ్గకుండా విసిగిస్తాయవి. అలాంటప్పుడు ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి.  - చిన్న అల్లపుముక్కను తొక్కు తీసి, శుభ్రంగా కడిగి, నమిలి రసాన్ని మింగితే మంచి ఫలితముంటుంది. ఓ కప్పు నీటిలో చెంచాడు యాలకుల పొడి వేసి మరిగించి, చల్లారబెట్టుకుని సేవించినా ఎక్కిళ్లు తగ్గుతాయి.

లేదంటే పెరుగులో కాసింత ఉప్పు కలుపుకుని, మెల్లమెల్లగా తింటున్నా ఆగుతాయి. అరచెంచా నెయ్యి, అరచెంచా ఆవాలు కలిపి నమిలి మింగినా మంచిదే. కొంచెం వెనిగర్‌గానీ, కొద్దిగా పీనట్ బటర్‌గానీ తీసుకున్నా ఉపయోగమే!
 

మరిన్ని వార్తలు