కామాఖ్య సిందూరం

14 Oct, 2018 01:45 IST|Sakshi

కామాఖ్య సిందూరాన్ని ‘కామియా’ అని కూడా అంటారు. అస్సాంలోని కామాఖ్యపీఠంలో ఏడాదికి ఒకసారి మాత్రమే దొరికే అత్యంత అపురూపమైన ప్రసాదం ఇది.  గడ్డకట్టిన నెత్తుటి రంగులో గట్టిగా రాళ్లలా దొరికే ఈ సిందూరాన్ని పొడిలా తయారు చేసుకుని, ఆవునేతిలో రంగరించి నుదుట తిలకంలా ధరించాలి. ఈ సిందూరాన్ని ధరించే ముందు దీనిని పూజ పీఠంలో ఉంచి, ధూప దీపాలతో పూజించాలి. దీనిని ధరించడం వల్ల సమస్త దృష్టిదోషాలు, క్షుద్రప్రయోగాల పీడలు తొలగిపోతాయి.

కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. శత్రుబాధలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. కామాఖ్య సిందూరాన్ని ప్రతిరోజూ ధరిస్తూ ఉన్నట్లయితే జనాకర్షణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థుల నుంచి తలెత్తే సమస్యలు సమసిపోతాయి. విద్యార్థులు దీనిని ధరించినట్లయితే ఉన్నత విద్యావంతులవుతారు. ఘనవిజయాలను సాధిస్తారు. అవివాహితులు ధరించినట్లయితే త్వరలోనే తగిన వారితో వివాహం జరుగుతుంది.

– పన్యాల జగన్నాథదాసు

మరిన్ని వార్తలు