స్ట్రాబెర్రీ మసాజ్‌

9 Nov, 2017 23:23 IST|Sakshi

బ్యూటిప్స్‌

స్ట్రాబెర్రీ స్క్రబ్‌

పది స్ట్రాబెర్రీ కాయలు, రెండు టేబుల్‌ స్పూన్ల ఆప్రికాట్‌ ఆయిల్‌ లేదా ఆలివ్‌ ఆయిల్, రెండు టీ స్పూన్ల రాతి ఉప్పు తీసుకుని అన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.     ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి పది నిమిషాల తర్వాత చర్మాన్ని సున్నితంగా మర్దన చేస్తే ఆరిన మిశ్రమంతోపాటు చర్మంలోని మురికి, మృతకణాలు పోతాయి.

తర్వాత మామూలుగా స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే రెండు వారాల్లోనే చర్మసౌందర్యంలో వచ్చిన మార్పును గమనించవచ్చు.

మరిన్ని వార్తలు