ఆత్మీయ స్పర్శతో ఒత్తిడి దూరం

4 Apr, 2018 00:45 IST|Sakshi

విపరీతమైన ఒత్తిడితో ఉన్నప్పుడు ఆప్తులెవరైనా కాసేపు మన చేతులు పట్టుకున్నారనుకోండి. ఏమనిపిస్తుంది? ఒత్తిడి తాలూకూ ఇబ్బంది ఎంతో కొంత తగ్గినట్టు అనిపిస్తుంది కదూ! అందులో వాస్తవం లేకపోలేదు అంటున్నారు గోథెన్‌బర్గ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని తాము ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నామని అంటున్నారు వారు. ఆత్మీయ స్పర్శతో ఒత్తిడి తగ్గుతుందని ఇప్పటికే తెలిసినప్పటికీ ఎందుకు? ఎలా? జరుగుతుందన్న విషయాలు మాత్రం ఇప్పటివరకూ తెలియవు.

ఈ నేపథ్యంలో ఛంటాల్‌ ట్రిస్కోలీ అనే శాస్త్రవేత్త 125 మందిపై కొన్ని ప్రయోగాలు చేశారు. దీర్ఘకాలపు స్పర్శతో శరీరంలో ఒత్తిడికి కారణమని భావిస్తున్న హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా గుండె కొట్టుకునే వేగం కూడా మందగిస్తున్నట్లు తెలుసుకోగలిగారు. ఒక రకమైన మానసిక తృప్తి ఏర్పడటం వల్ల ఇలా జరుగుతున్నట్లు ఇప్పటివరకూ అనుకునేవారని.. తమ ప్రయోగాల్లో దీనికి భిన్నమైన కారణాలు తెలిసాయని ఛంటాల్‌ చెప్పారు. ఈ ప్రయోగ ఫలితాల ఆధారంగా ఒత్తిడికి మరింత మెరుగైన చికిత్స అందించవచ్చునని అంటున్నారు.   

మరిన్ని వార్తలు