బలమైన కండరాలకు విటమిన్-ఇ

25 May, 2015 00:57 IST|Sakshi

కొత్త పరిశోధన
 ప్రొటీన్లు మాత్రమే కాదు, బలమైన కండరాల కోసం విటమిన్-ఇ కూడా చాలా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. కండరాల దారుఢ్యాన్ని కాపాడటంలో విటమిన్-ఇ కీలక పాత్ర పోషిస్తుందని వారు అంటున్నారు. మన శరీరంలో ప్రతి కణం చుట్టూ ప్లాస్మా పొర ఉంటుంది. ఇది బలహీనపడితే, కణం దెబ్బతింటుంది. కణాల చుట్టూ ఉండే ప్లాస్మా పొర దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా, బలహీనంగా మారిన ప్లాస్మా పొరను తిరిగి యథాస్థితికి తేవడంలో విటమిన్-ఇ కీలక పాత్ర పోషిస్తుందని జార్జియా మెడికల్ కాలేజీ నిపుణులు ఇటీవల జరిపిన పరిశోధనలో వెల్లడైంది.

మరిన్ని వార్తలు