సమ్మర్‌ కేర్‌

23 Mar, 2017 22:54 IST|Sakshi
సమ్మర్‌ కేర్‌

వేసవిలో పిల్లలు కుదురుగా ఇంట్లో ఉండమంటే ఉండరు. పైగా ఎండ వేడి. పిల్లలు ఎండలను తట్టుకొని, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తల్లులకు తెలిసుండాలి. చల్లదనం కోసం ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్‌ ఇప్పించవద్దు. వాటికి బదులు కొబ్బరి నీళ్లు, లస్సీ, షర్బత్‌ లాంటివి ఇస్తే దాహం తీరుతుంది. డయేరియా దరిచేరదు.

ఫ్రూట్స్‌ తినని పిల్లలకు వాటితో వెరైటీ స్వీట్స్, జ్యూస్‌ చేసి ఇస్తే ఇష్టపడతారు. ఫ్రిజ్‌లోని ఐస్‌ క్యూబ్స్‌తో ఆడుకోవడమన్నా, వాటినలాగే తినడమన్నా, చల్లటి నీటిని తాగడమన్నా పిల్లలకు సరదా. వీటి వల్ల గొంతుకు ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఎక్కువ.  ఎండ వేడిమిని తట్టుకోవడానికి కాటన్‌ దుస్తులనే వేయాలి. నైలాన్‌ దుస్తులు వేస్తే చెమట పొక్కులు, ర్యాష్‌ వస్తాయి.

మరిన్ని వార్తలు