సమ్మర్‌ అమృతం

10 May, 2018 00:18 IST|Sakshi

వేసవిలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. ఎంత చెరకు రసం తాగినా, ఎన్ని కొబ్బరి బొండాలు తాగినా కూడా దాహం తీరదు. మళ్లీ మళ్లీ తాగుతూనే ఉండవలసి వస్తుంది. వీటì తో పాటు కొన్ని సార్లు జల్‌ జీరా కూడా తాగడం మంచిది. ఈ పానీయాన్ని బయట కొని తాగడం కంటె, స్వయంగా ఇంట్లోనే తయారుచేసుకుని తాగడం ఆరోగ్యకరం.

కావలసినవి: గింజలు లేని చింత పండు – టేబుల్‌ స్పూను, పుదీనా ఆకులు – ముప్పావు కప్పు, జీల కర్ర – ఒకటిన్నర టీ స్పూన్లు, సోంపు – ఒక టీ స్పూను, మిరియాలు – అర టీ స్పూను, ఆమ్‌ చూర్‌ పొడి – అర టీ స్పూను, ఏలకుల పొడి – పావు టీ స్పూను, ఇంగువ – చిటికెడు, బూందీ – ఒక టేబుల్‌ స్పూను, చాట్‌ మసాలా – అర టీ స్పూను, రాళ్ల ఉప్పు – తగినంత

తయారీ:
పుదీనా ఆకులను శుభ్రంగా నీళ్లలో కడగాలి.
చింతపండును కూడా శుభ్రంగా కడగాలి.
పైన చెప్పిన పదార్థాలన్నిటినీ (బూందీ, చాట్‌ మసాలా తప్పించి) మిక్సీలో వేసి, ముప్పావు కప్పు నీళ్లు జత చేసి మెత్తగా చేసి వడపోయాలి.
 ♦ నాలుగు కప్పుల చల్లటి నీళ్లు జత చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.
గ్లాసులలో సర్వ్‌ చేసేటప్పుడు కొద్దిగా బూందీ, కొద్దిగా చాట్‌ మసాలా వేసి చల్లగా అందించాలి.

మరిన్ని వార్తలు