సమ్మర్ సలాడ్స్

22 Mar, 2016 01:58 IST|Sakshi
సమ్మర్ సలాడ్స్

చీపొమెగ్రనేట్  స్వీట్‌కార్న్ సలాడ్
 కావలసినవి
దానిమ్మకాయ - ఒకటి, స్వీట్‌కార్న్ - సగం కండె, అరటిపండు - సగం
ద్రాక్ష - అరకప్పు, జామపండు - సగం, ఖర్జూరాలు - పది

తయారి: స్వీట్‌కార్న్ అంటే తియ్యగా ఉండే మొక్కజొన్న కండె. దీనినే అమెరికన్ కార్న్ అని కూడా అంటారు. ఇది కూరగాయల మార్కెట్లలోనూ, సూపర్ మార్కెట్లలోనూ దొరుకుతుంది. ఇవి లేతగా, గిల్లితే పాలుకారుతుంటాయి. వండాల్సిన అవసరం ఉండదు. పచ్చిగానే తినవచ్చు. ముందుగా మొక్కజొన్న గింజలు ఒలిచి పక్కన ఉంచుకోవాలి. దానిమ్మకాయ గింజలను ఒలిచి అందులో వేసిన తర్వాత అరటి, జామపండ్లను సన్నని ముక్కలుగా కట్ చేసి కలుపుకోవాలి. ఖర్జూరాన్ని గింజలు తీసేసి సన్నని ముక్కలు చేసి ఫ్రూట్‌మిక్స్‌లో కలిపితే పొమెగ్రనేట్ - స్వీట్‌కార్న్ సలాడ్ రెడీ.

వాటర్‌మెలన్ సలాడ్
 కావలసినవి:
పుచ్చకాయ ముక్కలు -ఒక కప్పు
తర్బూజముక్కలు - అర కప్పు
పుదీన - రెండు రెమ్మలు
పెరుగు - ఒక టేబుల్ స్పూన్
ఉప్పు - చిటికెడు
ఇది చాలా సులభంగా చేసుకోదగిన సలాడ్. ఒక బౌల్‌లో పుచ్చకాయ, తర్బూజ ముక్కలు వేసి అందులో పుదీన ఆకులు, పెరుగు, ఉప్పు కూడా  కలపాలి. అంతే! వాటర్‌మెలన్ సలాడ్ రెడీ. సాధారణంగా పుచ్చకాయ తినేటప్పుడు, సలాడ్‌ల కోసం ముక్కలు కోసినప్పుడు గింజలను వదిలేస్తుంటారు. నిజానికి గింజలలో అనేక ఔషధగుణాలుంటాయి. కాబట్టి గింజలను తినాలి. అలాగే తర్బూజ గింజలు కూడా తినవచ్చు. వీటిని విడిగా తీసుకోవడం సులభం కాబట్టి ఎండబెట్టి పొడి చేసుకుని వాడుకోవచ్చు. అయితే గింజ నలిగేటట్లు నమలాలి
.
 స్ట్రాబెర్ర గ్రేప్ సలాడ్
 కావలసినవి
స్ట్రాబెర్రీలు - పది (సన్నగా ముక్కలు చేయాలి)
ద్రాక్ష - ఒక కప్పు, సపోటాముక్కలు - అర కప్పు
జామముక్కలు - అర కప్పు, నల్లద్రాక్షరసం - ఒక టేబుల్ స్పూన్
గార్నిష్ చేయడానికి: క్రీమ్ - మూడు టీ స్పూన్లు, చెర్రీలు - నాలుగు
తయారి
స్ట్రాబెర్రీ, జామ, సపోట ముక్కలను, ద్రాక్షపండ్లను కలపాలి. సర్వ్ చేసే ముందు ఈ ముక్కలను కప్పులో వేసి ఒక్కొక్క కప్పులో ఒక టీ స్పూన్ ద్రాక్షరసం వేసి పైన క్రీమ్ పెట్టి చెర్రీతో అలంకరించాలి. ముందుగా క్రీమ్ పెట్టి దాని మీద ద్రాక్షరసం వేసినా బాగుంటుంది. పిల్లలు క్రీమ్ ఇష్టపడతారు కాబట్టి కాస్త ఎక్కువ క్రీమ్ వేసి మధ్యలో చెర్రీ పెట్టి దాని చుట్టూ ద్రాక్షరసం రకరకాల బొమ్మల షేప్ వచ్చేటట్లు వేస్తే ఆనందంగా తింటారు.

మరిన్ని వార్తలు