నాకు వెన్ను నొప్పి... సర్జరీ తప్పదా?

28 Nov, 2013 00:53 IST|Sakshi
నాకు వెన్ను నొప్పి... సర్జరీ తప్పదా?

నేను కంప్యూటర్‌పై కూర్చుని ఎక్కువగా పనిచేస్తుంటాను. ఇటీవల విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే సర్జరీ అవసరం అన్నారు. నాకు సర్జరీ అంటే భయం. మరో మార్గం లేదంటారా?
 - సులోచన, విశాఖపట్నం

 
సాధారణంగా యాక్సిడెంట్ లేదా ఏదైనా వ్యాధి కారణంగానో వెన్నునొప్పి వచ్చిన సందర్భాలను మినహాయించి, ప్రతి వెన్నునొప్పికీ శస్త్రచికిత్స ఒక్కటే మార్గం కాదు. సర్జరీతోనే వెన్నునొప్పికి పరిష్కారం దొరుకుతుందనీ, ఆపరేషన్ చేయకపోతే తగ్గదనేది అపోహ మాత్రమే. మనం కూర్చునే భంగిమలు ఎలా ఉన్నాయో తెలుసుకొని, ఒకవేళ ఫాల్టీ పోశ్చర్స్‌ల్లో కూర్చుంటుంటే వాటిని సరిచేసుకుంటే చాలావరకు సమస్య తగ్గుతుంది.

కాబట్టి సాధారణ వెన్నునొప్పుల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ, తగిన చికిత్స తీసుకుంటే చాలావరకు అవి తగ్గుతాయి. ఇక కొన్ని రకాల వెన్నునొప్పులు బరువులు ఎత్తుతుండటం వల్ల వస్తే... వాటిని ఎత్తే విధానాల్లో మార్పులతో అవి కూడా తగ్గుతాయి. ఇంకొన్ని రకాలు కొన్ని వ్యాయామాలతో నయమవుతాయి. వెన్నునొప్పులకు యోగా కూడా చక్కటి మార్గం. అయితే నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఆసనాలు వేయడం మంచిది కాదు. అందుకే యోగా ఎప్పుడు, ఎలా చేయాలన్నది ట్రైనర్ సహాయంతో చేస్తేనే మంచిది.
 
 డాక్టర్ భక్తియార్ చౌదరి
 స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్‌నెస్ నిపుణుడు, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు