స్వీట్ లైట్స్

9 Nov, 2015 23:21 IST|Sakshi
స్వీట్ లైట్స్

మనవన్నీ తియ్యటి సంప్రదాయాలు.
మనవన్నీ తియ్యటి అనుబంధాలు.
మనవన్నీ తియ్యటి అతిథి మర్యాదలు
ఈ తియ్యదాన్ని కొనసాగిద్దాం.
‘స్వీట్ లైట్స్’తో దీపావళిని వెలిగిద్దాం.

 
ఆపిల్ గుజియా
కావలసినవి: గోధుమపిండి  - 2 కప్పులు, కరిగించిన నెయ్యి లేదా వెన్న - కప్పు, చన్నీళ్లు - కప్పు, ఉప్పు - కొద్దిగా
 ఆపిల్ కోయా కోసం: పచ్చి కోవా - కప్పు, ఆపిల్స్ - 4 (మీడియం సైజువి, సన్నగా తురమాలి), దాల్చిన చెక్క పొడి - అర టీ స్పూను, ఏలకుల పొడి - అర టీ స్పూను, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుల తరుగు - 3 టేబుల్ స్పూన్లు, పంచదార - 3 టేబుల్ స్పూన్లు, నూనె-డీప్ ఫ్రైకి సరిపడా
 
తయారీ: ఒక పెద్ద పాత్రలో గోధుమపిండి, పంచదార కలిపి జల్లించాలి          కరిగించిన నెయ్యి జత చేసి, మిశ్రమం బాగా కలిసేవరకు కలపాలి          చన్నీళ్లు పోస్తూ చపాతీపిండిలా క లిపి, పైన మూత ఉంచి సుమారు అరగంటసేపు నాననివ్వాలి  స్వీట్ స్టఫింగ్ తయారీ  బాణలి వేడి చేసి, పంచదార, ఆపిల్ తురుము వేసి బాగా కలిపి, సుమారు పది నిమిషాలు ఉడకనివ్వాలి  దాల్చినచెక్క, ఏలకుల పొడులు జత చేయాలి  ఐదు నిమిషాల తర్వాత కోవా మిశ్రమం వేసి బాగా కలపాలి  కోవా కరుగుతుండగా బాగా కలుపుతుండాలి  డ్రైఫ్రూట్స్ తరుగు జత చేసి, బాగా కలిపి దించి, చల్లారనివ్వాలి  చపాతీ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, గుండ్రంగా పూరీలా మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఒత్తాలి  తయారుచేసి ఉంచుకున్న ఆపిల్ మిశ్రమాన్ని కొద్దిగా ఇందులో ఉంచి అంచులు మూసేయాలి. (కొద్దిపాటి నీళ్లతో తడి చేస్తే బాగా అతుకుతుంది)          ఇదేవిధంగా అన్నీ తయారుచేసుకుని పక్కన ఉంచుకోవాలి  బాణలిలో నూనె వేడయ్యాక, తయారుచేసి ఉంచుకున ఘుజియాలను ఒక్కొక్కటిగా వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి, పేపర్ న్యాప్‌కిన్ మీదకు తీసుకోవాలి.
 
తీపి చక్రాలు
కావలసినవి: పెసలు - కప్పు, బియ్యం - 6 కప్పులు, ఉప్పు - కొద్దిగా, బెల్లం - 2 కప్పులు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
 తయారీ:  ముందుగా పెసలను బాణలిలో నూనె లేకుండా వేయించాలి  రోట్లో వేసి తేలికగా దంచి పప్పులా అయిన తర్వాత, చేటలో వేసి పొట్టు చెరగాలి  పెసరపప్పు, బియ్యం కలిపి మర పట్టించాలి  ఒక పెద్ద గిన్నెలో తగినన్ని నీళ్లు, ఉప్పు, నూనె వేసి నీళ్లు మరిగించాలి  ఒక పెద్ద పాత్రలో పిండికి కాచిన నీళ్లు జతచేస్తూ జంతికల పిండి మాదిరిగా కలపాలి  బాణలిలో నూనె కాగాక, ఈ పిండిని చిన్న చిన్న జంతికల్లా వేసి (బాగా సన్నటి రంధ్రాలు ఉన్న దాని నుంచి వీటిని తయారుచేయాలి) దోరగా వేగిన తర్వాత పళ్లెంలోకి తీసుకోవాలి  ఒక పాత్రలో బెల్లం,తగినన్ని నీళ్లు వేసి తీగపాకం పట్టాలి         తయారుచేసి ఉంచుకున్న చక్రాల మీద ఈ పాకం కొద్దికొద్దిగా పోసి ఆరనివ్వాలి  బాగా చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
 
బాదాం పూరీ
కావలసినవి: గోధుమపిండి - కప్పు, బాదం పప్పులు - పావు కిలో, పంచదార పొడి - అర్ధ పావు, కుంకుమ పువ్వు - కొద్దిగా, ఏలకుల పొడి - టేబుల్ స్పూను, కండెన్స్‌డ్ మిల్క్ - తగినంత
 
తయారీ:  బాదం పప్పుల మీద తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి  ఒక పాత్రలో బాదం పప్పుల పొడి, పంచదార పొడి, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, గోధుమ పిండి వేసి, కలపాలి. (అవసరమనుకుంటే తగినన్ని పాలు జత చేస్తూ చపాతీపిండిలా కలపాలి)  చిన్న చిన్న ఉండలుగా చేసి, నూనె పూసిన బేకింగ్ ట్రే మీద ఉంచాలి  350 ఫారెన్‌హీట్ దగ్గర ప్రీ హీట్ చేసిన అవెన్‌లో ఉంచి పది నిమిషాలు బేక్ చేసి తీసేయాలి.
 
మేథీ మటర్ మలై
కావలసినవి: మెంతి ఆకులు - 2 కప్పులు, ఉడికించిన బఠాణీ - కప్పు, తాజా క్రీమ్ - కప్పు, నెయ్యి లేదా నూనె - 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు - అర కప్పుకి తక్కువగా, పంచదార - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత
 పేస్ట్ కోసం: ఉల్లి తరుగు - అర కప్పు, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 4, అల్లం తురుము - అర టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను, జీడిపప్పులు - అర కప్పు, కొత్తిమీర తరుగు - కొద్దిగా
 
తయారీ:  మిక్సీలో ఉల్లి తరుగు, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పులు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జతచేయాలి  బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న ఉల్లి ముద్ద వేసి ఆరేడు నిమిషాలు ఆపకుండా కలుపుతూ వేయించాలి. అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేయాలి  మెంతి ఆకులు, పావు కప్పు నీళ్లు జత చేసి బాగా కలిపి, సుమారు పది నిమిషాలు సన్నని మంట మీద ఉంచాలి  ఉడికించిన బఠాణీ, తాజా క్రీమ్ జత చేసి, సుమారు ఆరేడు నిమిషాలు సన్నని మంట మీద ఉంచాలి  ఉప్పు, పంచదార జత చేసి మరోమారు బాగా కలిపి దించేయాలి  కొత్తిమీరతో అలంకరించి, నాన్ లేదా పుల్కాలతో కలిపి వడ్డించాలి. (తీపి ఇష్టపడని వారు పంచదార లేకుండా తయారుచేసుకోవచ్చు)
 
అరటిపండు బూరెలు

కావలసినవి: గోధుమపిండి - కప్పు, బెల్లం పొడి - అర కప్పు, కొద్దిగా పండిన అరటిపండ్లు - 2 (అర కప్పు గుజ్జు), బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి - టీ స్పూను, బేకింగ్ సోడా - పావు టీ స్పూను, ఉప్పు - చిటికెడు, నూనె-డీప్ ఫ్రైకి సరిపడా
 తయారీ:  ఒక పాత్రలో బెల్లం తరుగు, కొద్దిగా నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి కరిగించి, వడకట్టాలి  అరటిపండును మెత్తగా గుజ్జు చేయాలి  ఒక పాత్రలో గోధుమ పిండి, బియ్యప్పిండి, ఏలకుల పొడి, బేకింగ్ సోడా, ఉప్పు, అరటి పండు గుజ్జు వేసి బాగా కలపాలి  బెల్లం పాకం జత చేసి మరోబమారు కలపాలి      కొద్దిగా నీళ్లు జత చేస్తూ, గట్టిగా ఉండేలా కలపాలి      బాణలిలో నూనె కాగాక, గరిటెడు పిండిని నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి వేడివేడిగా అందించాలి.
 
 

మరిన్ని వార్తలు