టీ షర్ట్‌కి కొత్తరూపు

16 Mar, 2017 23:02 IST|Sakshi
టీ షర్ట్‌కి కొత్తరూపు

న్యూలుక్‌

ఈ కాలపు అమ్మాయిల వార్డ్‌రోబ్‌లో లెక్కకుమించి టీషర్ట్‌లు.వాటిలో ఎన్నో మోడల్స్‌! వాటిలో కొన్ని కొటేషన్లతో అదరగొట్టేవి, ఇంకొన్ని రంగు డిజైన్లతో ఆకట్టుకునేవి, మరికొన్ని ప్లెయిన్‌గా మనసుకు హత్తుకునేవి. వీటికి కొన్ని హంగులు చేర్చితే... ‘కొత్త డిజైన్‌ టీ షర్ట్‌ ఎక్కడకొన్నావ్‌?’ అనే ప్రశ్న మిమ్మల్ని పలకరించాల్సిందే!

ముందుగా కాలర్‌ లేని ప్లెయిన్‌ టీ షర్ట్‌ని ఎంచుకోవాలి. దానికి అదే రంగు బనియన్‌ క్లాత్‌ని ఎంచుకోవాలి. ఫొటోలో చూపిన విధంగా చిన్న చిన్న డిజైన్‌ ముక్కలుగా కట్‌ చేయాలి. వాటిని ప్లెయిన్‌ టీ షర్ట్‌కి ఛాతీ భాగంలో కుట్టాలి. దీంతో కొత్త టీ షర్ట్‌ రెడీ అవుతుంది. కాంట్రాస్ట్‌ బనియన్‌ క్లాత్‌ ఎంచుకోవాలి. పువ్వు డిజైన్‌కి అనుకూలంగా చిన్న చిన్న ముక్కలు కట్‌ చేయాలి. వాటిని టీ షర్ట్‌కి ఛాతీ భాగంలో పువ్వు డిజైన్‌ వచ్చేలా మిషన్‌ మీద కుట్టేయాలి. అక్కడక్కడా తెల్లని లేదా రంగు పూసలను కుడితే ఇలా చూడముచ్చటైన టీ షర్ట్‌ మీదవుతుంది.  టీ షర్ట్‌కి టాప్‌ భాగం అంటే చేతులు, నెక్‌ భాగాన్ని కత్తిరించాలి. ఈ ప్లేస్‌లో ఎంపిక చేసుకున్న లేస్‌ను కుట్టాలి. మరో ముచ్చటైన టీ షర్ట్‌ సిద్ధం అవుతుంది.

మరిన్ని వార్తలు