టేబుల్ ట్యాబ్లెట్

28 Jul, 2016 22:54 IST|Sakshi
టేబుల్ ట్యాబ్లెట్

టెక్ టాక్ /  కెనైటీ

 
ట్యాబ్లెట్ కంప్యూటర్ అంటే పది అంగుళాల నుంచి 20 అంగుళాల సైజు ఉంటాయని ఊహించుకోవచ్చు. కానీ ఫొటోలో కనిపిస్తోందే... ఇది కూడా ఓ ట్యాబ్లెట్టే. పేరు కెనైటీ... సైజు మాత్రం ఏకంగా 42 అంగుళాలు. కాఫీ టేబుల్ మాదిరిగా దీనిపై వేడివేడి కాఫీ కప్పుల్ని ఉంచుకోవచ్చు.. లేదంటే మీకిష్టమైన కూల్‌డ్రింక్‌ను ఎంజాయ్ చేస్తూ కూడా ట్యాబ్లెట్‌ను వాడుకోవచ్చు. అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకునే విధంగా ఈ ట్యాబ్లెట్ ఉపరితలంపై దృఢమైన కార్నింగ్ 3 గొరిల్లా గ్లాస్ ఉంది మరి! ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే కలిగి ఉన్న కెనైటీ విండోస్ 10 ఆపరేషన్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది.


ఇంట్లో ఉండే అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలను నియంత్రించేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. మీ చేతి కదలికలతోనే టీవీ ఛానళ్లు మార్చవచ్చు... స్మార్ట్‌ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలను టీవీ తెరపై చూడవచ్చునన్నమాట. స్క్రీన్‌ను విభజించుకుని ఏకకాలంలో ఇద్దరు ముగ్గురు వేర్వేరు అప్లికేషన్లను రన్ చేయవచ్చు కూడా. ఇటలీ కంపెనీ తయారు చేసిన ఈ హైటెక్ కాఫీ టేబుల్ ట్యాబ్లెట్ ధర దాదాపు రూ. నాలుగు లక్షలు.

మరిన్ని వార్తలు