మే 23 నుంచి మే 29 వరకు

23 May, 2015 01:42 IST|Sakshi
మే 23 నుంచి మే 29 వరకు

టారో బాణి
మెరుగైన విజయాలు సాధించడానికి ఇది సరైన సమయం. పనులు పూర్తి చేయడంలో గతంలో కంటే ఉత్సాహంగా ఉంటారు. ఒక వ్యక్తి నుంచి సహాయం లభిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో, వాటిని  కాపాడుకునే విషయంలో ఒకింత ఒత్తిడికి గురవుతారు. చిన్నపనుల కోసం అధిక శ్రమ అక్కర్లేదు.  కలిసి వచ్చే రంగు: ఎమరాల్డ్ గ్రీన్
 
అనుకోకుండా ఎదురయ్యే ఒక సంఘటన మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళుతుంది.  ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులకు మించిన లాభాలు అందుకుంటారు. ప్రతి సమస్యను పరిష్కరించుకుంటారు. అందరికీ మీ పనితనం తెలిసేలా చేస్తారు. ప్రేమ వ్యవహారాలు మంచి మలుపు తిరుగుతాయి. కలిసి వచ్చే రంగు: ఊదా రంగు
 
 విజయానందాలు మీ సొంతమయ్యే కాలం. ఆశావహదృక్పథంతో వ్యవహరిస్తారు. ఆర్థిక అంశాలకు సంబంధించి మీకు బాగా ఆనందం కలిగించే వార్త ఒకటి తెలుస్తుంది. ప్రతి విషయానికీ పలు ఆప్షన్లు మీ ముందు కనిపిస్తాయి. ఎంపిక విషయంలో కన్‌ఫ్యూజ్ అవకుండా ఆచితూచి అడుగేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కలిసి వచ్చే రంగు: లేత నీలం
 
 కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ‘విభిన్నమైన ప్రపంచంలో ఉన్నాను’ అనే భావనకు గురవుతారు. మీ జ్ఞానం, వైవిధ్యభరిత ఆలోచనల వల్ల మంచి అవకాశాలు అందుకుంటారు.   సహచరులతో వాదనకు దిగే పరిస్థితి రావచ్చు. అయితే ఆ వాదనను వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఔట్‌డోర్ స్పోర్ట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: సిల్వర్
 
 కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. ముఖ్యమైన డాక్యుమెంట్లపై సంతకాలు జరుగుతాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ప్రేమ విషయాలు కొంత ఇబ్బంది పెడతాయి. బంధుమిత్రులతో అపార్థాలను తొలగించుకోవడం మంచిది. గొంతుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. కలిసివచ్చే రంగు: ఆరెంజ్
 
 అనుకోని అవకాశాలు మీ దరికి వస్తాయి. మీ కలలు నిజమవుతాయి. ఒక వ్యక్తి మిమ్మల్ని ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ‘రిస్క్’ అనుకొని వెనకడుగు వేయడానికి ప్రయత్నించిన  పనులు సైతం అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. మీరు బాగా ప్రేమించే ఒక వ్యక్తిని కలుసుకుంటారు. కలిసి వచ్చే రంగు: లేత గోధుమ
 
 మీ కమ్యునికేషన్ స్కిల్స్ మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. పనిలో ప్రతిభ చూపి ప్రశంసలు అందుకుంటారు. సమావేశాల్లో మీ ప్రతిభ గురించి అందరూ మాట్లాడుకుంటారు. వెన్నునొప్పి, మైగ్రెయిన్స్ లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కలిసివచ్చే రంగు: గులాబి
 
 అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే మీకున్న ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యలను పరిష్కరించుకుంటారు. పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాదు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏవైనా కళల మీద మనసు పెట్టండి. తద్వారా సంతోషంగా ఉంటారు. వీలైనంత వరకూ ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. కలిసివచ్చే రంగు: గ్రే
 
 ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. కొత్త బంధాలు సంతోషాన్ని ఇస్తాయి. అంతరాత్మ చెప్పినదాని ప్రకారం నడుచుకోండి. పనికి సంబంధించి కొత్త అవకాశాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరిస్థితిని  మెరుగుపరుచుకుంటారు. బయటి వాతావరణం శరీరానికి సరిపడకపోవచ్చు. కలిసి వచ్చే రంగు: బ్రైట్ గ్రీన్
 
 మీ మనసుకు దగ్గరయ్యే వ్యక్తిని  ఇప్పటి వరకు మీరు  కనుక్కోలేకపోతే, ఆ వ్యక్తిని ఎంచుకోవడానికి తగిన సమయం. మీలోని సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభించే సమయం కూడా. గాసిప్‌లను పట్టించుకోకుండా ఉండడం మంచిది. ఒకవేళ వాటికి ప్రాధాన్యత ఇస్తే, మీ పనికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. ఆరోగ్యంపై  శ్రద్ధ పెట్టండి. కలిసివచ్చే రంగు: ఆరెంజ్
 
 మీ చుట్టూ ప్రేమ పూరితమైన వాతావరణం కనిపిస్తుంది. జీవితం, ప్రేమకు సంబంధించిన  విషయాల్లో ఆత్మశోధన చేసుకుంటారు.  మీ నిర్వహణా సామర్థ్యానికి మించి పనిలో మీకు కొత్త బాధత్యలు వచ్చి పడతాయి. కొన్నిరోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కలిసి వచ్చే రంగు: బ్రౌన్
 
 ఈ వారమంతా సరదా మూడ్‌లో ఉంటారు. ఉల్లాసంగా గడుపుతారు. ఒక తోడు కోసం అన్వేషించేవారికి ఇది తగిన సమయం. పరిస్థితుల మార్పు గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. అయితే బ్యాక్‌పెయిన్ బాధించవచ్చు. అన్ని విషయాల్లోనూ మీ అంతరంగం చెప్పేదాన్ని వినడం ఉత్తమం. కలిసి వచ్చే రంగు: లేత నీలం
 
ఇన్సియా కె.
టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్

 
 సౌర వాణి
ఆర్థికంగా బాగా ఉన్నామని ఖర్చుల్ని పెంచుకోకండి. శారీరకంగా బాగున్నామనే ఆలోచనతో ఆహార విహారాదుల్లో పరిమితిని దాటకండి. ఉద్యోగపరంగా ప్రోత్సాహకరంగానే ఉంది కదా అని కింది ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ అలాగే సహోద్యోగులతోనూ వివాదం తెచ్చుకోవద్దు. వారంలో ఒక్కరోజైనా గోవులకి పచ్చగడ్డిని పెట్టించండి.
 
 ఇంటికొచ్చిన మూడోవ్యక్తి కారణంగా కుటుంబంలో అనైకమత్యం తలెత్తవచ్చు. వ్యాపారంలో భాగస్వాములతో కొద్దిగా వాదవివాదాలు వృత్తి ఉద్యోగాల్లో మనఃస్పర్థలు తలెత్తవచ్చు. ఇలాంటి సంఘటనలు రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే ముందు జాగ్రత్తతో ఉండటం మంచిది. వారంలో రెండు రోజుల పాటైనా గోవులకి చక్కని పండ్లని ఇప్పించండి.
 
 ప్రతి పనీ వాయిదా పడుతూ, భార్యాభర్తలు ఐకమత్యంతో లేకుండా, కుటుంబ రహస్యాలు పక్కవారికీ బంధువులకీ చేరుతూ ఈ వారమంతా నిర్వేదంతో నిరాసక్తతతో ఉండవచ్చు. ఇది తాత్కాలిక ఘర్షణం మాత్రమే. ఉద్యోగపు మార్పు స్థానచలనం, అద్దెఇంటి మార్పు వస్తే తప్పక మారండి. గోవులకి ఇష్టమైన కుడితిని గోశాలకి వెళ్లి పెట్టించండి.
 
 కాలం నేర్పిన అనుభవం దృష్ట్యా వేటికి దూరంగా ఉండాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకు బాగా అర్థమైన కారణంగా అలాగే ప్రయాణించండి. ఎంతటి దగ్గరవారొచ్చి అడిగినా హామీలనీ వాగ్దానాలనీ రుణాలనీ పూర్తిగా మానండి. మీకు కలిగిన సంతోషాన్ని కూడ లోపలే దాచుకోవలసిన వారం ఇది. గోవులకి ఆకుకూరల్ని పెట్టించండి.
 
 కొత్త వ్యాపారాన్ని  ప్రారంభించడానికి కావలసిన అన్నింటినీ సమకూర్చుకోండి. దూర ప్రయాణాలు చేయవలసివచ్చినా నష్టమపోతామేమోననే భయం వద్దు. దాన ధర్మాలతో పాటు, పిల్లలు చదువుల్ని అశ్రద్ధ చేయకుండా చేసుకుంటూ ఉండండి. ఒక్క ఆవుకైనా ఈగ/దోమ బాధ లేకుండా దోమతెరని అందించండి.
 
 భార్యాభర్తల ఐకమత్యానికున్న గట్టిదనం ముందు ఉక్కుసౌధాలు కూడ పెళుసే అనే విశేషాన్ని స్వయంగా గమనిస్తారు. సరైన సమయానికి భోజనం, నిద్ర అనేవాటిని చూసుకుంటూ అనారోగ్యం ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. మద్యం, జూదం వంటివాటిని మానే ప్రయత్నం ప్రారంభించండి. సంతాన అభివృద్ధి కోసం గోవులకి పచ్చికూరముక్కల్ని పెట్టించండి.
 
 మిమ్మల్నీ మీ జీవితాన్నీ గురించి వ్యక్తిగతంగా మీకు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. యంత్రాలూ వాహనాల విషయంలో తగినంత జాగ్రత్తతో వ్యవహరించండి. మీవైపు నుండే కాకుండా మీరు ఎవర్ని శత్రువులుగా చూస్తున్నారో వారివైపు నుండి ఆలోచించండి ఏకాంతంలో. అంతా సవ్యమౌతుంది. గోవులకి ఆరోగ్యకరమైన నీటిని వారం రోజులపాటు అందించండి.
 
 అందరూ మీ మాట కాఠిన్యానికి భయపడి గౌరవిస్తున్నారేమో గమనించుకోండి. నిదానమైన మాట పదిమందిని దగ్గరికి రానిస్తుందని గ్రహించండి. చిన్నపాటి వైద్యపరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. తీసుకున్న రుణం ఒకపక్క నిదానంగా ఖర్చు అయిపోతోందేమో (రుణం తీసుకున్న పనికి కాక) పరిశీలించుకోండి. గోవులకి తెలకపిండిని అందించండి.
 
 ఆశించిన ఉద్యోగం ఇదుగో!  అంటూ దూరదూరం జరిగిపోతూండవచ్చు. మీ ఏకపక్ష నిర్ణయం కారణంగా బంధుమిత్రులు వ్యతిరేకులయ్యే ప్రమాదమూ ఉండవచ్చు. వివాహమయ్యాక కూడ తల్లిదండ్రులకీ అలాగే అన్నదమ్ముల మాటలకే ప్రాధాన్యాన్నిస్తున్నారేమో ఆత్మపరీక్ష చేసుకుని మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. గోవులకి వైద్యపరీక్షలు యథాశక్తి చేయించండి.
 
 రోజులు దొర్లిపోతున్నాయనే సంతృప్తితో వ్యాపారాన్ని విస్తరింపజేయడం లేదేమో గమనించుకోండి. మాట పట్టుదల కారణంగా పెద్దల్ని దూరం చేసుకున్నామేమో ఆలోచించి సాన్నిహిత్యం కోసం ప్రయత్నించండి. గోవులకి ఎండ బాధ లేకుండా ఉండే నూనెకి సొమ్ముని అందించండి.
 
 మీకు మీరుగా నిర్ణయాన్ని తీసుకోకుండా పై అధికారి సూచనలు ఆజ్ఞలనే పాటించండి. మీరు ఏ పొదుపు లేదా వ్యయం చేయదలచినా భార్య/భర్తకి ముందుగా తెలియజేయండి. వివాహం కొత్త ఇంటి కొనుగోలు స్థలం మొదలైనవాటి కొనుగోలు విషయంలో ఒకరికిద్దర్ని సంప్రదించి మరీ తీసుకోండి. గోవులకి మీకు తోచిన సేవ చేయండి.
 
 పిల్లల చదువుల కారణంగా తాత్కాలికమైన ఆర్థిక భారం కలుగుతుంది. రుణాన్ని చేయడం తప్పుకాదని గ్రహించండి. ఉద్యోగంలో వచ్చిన పదవీ ఉన్నతి కారణంగా బాధ్యతలు పెరిగి కొంత పని ఒత్తిడి, అసహనం పెరుగుతాయి. రోజూ ప్రాణాయామాన్ని క్రమం తప్పక చేయండి. గోవులకి ఎండుగడ్డిని యథాశక్తి అందించండి.
- డా॥మైలవరపు శ్రీనివాసరావు
సంస్కృత పండితులు

మరిన్ని వార్తలు