వారికి ఆమె.. అమ్మ

30 Sep, 2017 04:00 IST|Sakshi

నా వల్ల ఏం అవుతుంది.. అనుకునే వ్యక్తులు మన చుట్టూ ఎంతమంది ఉంటారో..  నా వరకు నేను ఏదైనా చేయగలను అనుకునే వారు అంతమందే ఉంటారు.వీ రెండోకోవలోకి వచ్చేవారితో సమాజానికి ఎంతోకొంత మేలు జరుగుతుంది. ఇదిగో ఇటువంటి జాబితాలోకే తరుణా విధయ్‌ చేరతారు. ఓ వైపు ఉద్యోగం చేసుకుంటూ.. మరోవైపు అనాదలైన చిన్నారుల ఆకలితీరుస్తూ.. ఆమె ముందుకు సాగుతోంది. బ్యాంక్‌ ఉద్యోగిగా క్షణం తీరికలేకుండా.. పనిచేసే తరుణా.. ఘజియాబాద్‌ చిన్నారులకు అమ్మలా మారింది. నేను ఒకప్పుడు ఇటువంటి పరిస్థితుల్లోనే జీవించాను.. ఆ గతాన్ని ఎన్నడూ మరువను.. అని చెబుతోంది తరుణ. ఇంతకీ ఎవరీ తరుణ.. ఏమిటా కథా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

ఘజియాబాద్‌లోని ఒక కార్పొరేట్‌ బ్యాంక్‌లో మేనేజర్‌గా తరుణ (30) విధులు నిర్వహిస్తోంది. రోజూ ఆఫీస్‌ ఇందిరాపురం మీదుగా వెళ్లే సమయంలో అక్కడ వీధి బాలలను గమనించేంది. వీరికి ఏదైనా చేయాలని మనస్సులో పలుసార్లు అనుకున్నా కార్యలరూపం దాల్చలేదు. అయితే ఒక సందర్భంలో ఒక చిన్నారి ఆకలితో అలమటించడం చూసి చలించి పోయింది తరుణ. వెంటనే వారికోసం ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు దిగింది. ఆమె ప్రయాణం ఎలా సాగిందో.. ఆమె మాటల్లోనే..!

నేను ఇక్కడినుంచే వచ్చా!
నా చిన్నతనంలో సాయం కోసం మా కుటుంబం ఎదురు చూసిన రోజులు నేను మర్చిపోలేను. ముఖ్యంగా నాచదువు సాగే రోజుల్లో ఇది మరీ ఎక్కువగా ఉం‍డేది. చాలా మంది దాతల మూలంగా నేను చదువుకోగలిగాను.. ఆకలి తీర్చుకున్నాను.. నేడు ఈ స్థితిలోకి వచ్చాను.. నా మూలాలు నేను మరువను. అందుకే వీధి పిల్లల కోసం ముందుకు వచ్చాను.

వాళ్లే ప్రపంచం
నా ఉద్యోగం సాయంత్రం 5 గంటలకు అయిపోతుంది. అప్పటినుంచి సామయమంతా ఇందిరాపురం చిన్నారులతోనే గడిచిపోతుంది. వారితోనే ఆటలు, పాటలు, చదువు. డ్యాన్స​ ఇలా ఒకటేమిటి.. అంతా వారితోతోనే. రోజులో కనీసం నాలుగు గంటలు వాళ్లతోనే గడిపేస్తానని తరుణ చెబుతోంది. చిన్నారులకు ఆర్థిక సహాయం అందించడమే.. వారి కోసం స్నేహితుల నుంచి ఫండ్‌ కలెక్ట్‌ చేస్తోంది.

కాబోయే భర్తకు ముందుగానే..!
తాను చేస్తున్న పనులు, ముఖ్యంగా చిన్నారుల గురించి కాబోయో భర్తకు ముందుగానే తరుణ వివరించింది. ఈ కార్యక్రమాలను తాను నిర్వహిస్తున్నానని..  భర్తకూడా ఇందులో పాలుపంచుకోవాలని ముందుగానే చెప్పేసింది. అందుకు అంగీకరిస్తేనే పెళ్లి.. లేందటే లేదని స్పస్టం చేసింది. ప్రస్తుతం తరుణతో పాటు.. ఆమె భర్త కూడా చిన్నారుల సేవలో ఉన్నారు. వీధి బాలురుగా ఉన్న వారికి తరుణ, ఆమె స్నేహితులు ఖాళీ సమయాల్లో చదువు చెప్పడం, వారికి ఆహారాన్ని అందించడం చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు