రుచికే కాదు... ఆరోగ్యానికి కూడా!

10 Oct, 2017 00:27 IST|Sakshi

గుడ్‌ ఫుడ్‌

తీపి వంటకాల్లో యాలకులను వేయడం వల్ల వాటికి మంచి రుచి, వాసన వస్తాయి. దీంతో ఆయా వంటకాలను తినాలనిపిస్తుంది. అయితే యాలకులు కేవలం వంటలకు రుచినివ్వడమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక లాభాలు చేకూరుస్తాయి. అవేమిటో చూద్దాం...

►భోజనం చేసిన వెంటనే ఒకటి రెండు యాలకులను నములుతూ ఉంటే నోటి దుర్వాసన పోతుంది. జీర్ణ సమస్యలు ఉండవు.
►ఆస్తమా, దగ్గు, జలుబును తగ్గించడంలో యాలకులు మెరుగ్గా పనిచేస్తాయి. రోజుకు మూడు, నాలుగుసార్లు కొన్ని యాలకులను తీసుకుని బాగా నమిలి చప్పరిస్తే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
►యాలకులను రోజూ తింటుంటే గుండె సమస్యలు పోతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది.
►రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ యాలకులను తినాలి. దీంతో రక్తం పెరుగుతుంది.
►శరీరంలో ఉన్న విష, వ్యర్థపదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రపడుతుంది.
►రెండు, మూడు యాలకులు, లవంగాలు, చిన్న అల్లం ముక్క, ధనియాలను తీసుకుని పొడి చేసి, గ్లాస్‌ వేడినీటిలో కలుపుకుని తాగితే అజీర్ణ సమస్య పోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ తగ్గుతాయి.
►సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి.

మరిన్ని వార్తలు