ఈ సమ్మర్ మీదే!

17 Apr, 2014 01:38 IST|Sakshi
ఈ సమ్మర్ మీదే!

టీనేజ్
 టీనేజ్ లైఫ్‌లో వేసవి సెలవులు అమూల్యమైనవి. ఈ కాలంలో ప్రపంచం మీ సొంతం అవుతుంది. వేసవి అనేది రిలాక్స్ అవడం  కోసం మాత్రమే కాదు. మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి తగిన సమయం.. అందుకే మీ కోసం కొన్ని సూచనలు...
స్నేహితులతో కలిసి ఔట్‌డోర్‌లో సమ్మర్ క్యాంప్ ప్లాన్ చేయండి.కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు. ఈ వేసవిలో కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి.

 

సాధించదలచిన లక్ష్యాల జాబితా ఒకటి తయారు చేసుకోండి.  ఆ లక్ష్యాల సాధనకు అవసరమైన ప్రణాళికను పక్కాగా తయారుచేసుకోండి.బరువు ఎక్కువగా ఉంటే తగ్గడానికి తగిన వ్యాయమాలు చేయండి. బరువు మరీ తక్కువగా ఉంటే పెరిగే ప్రయత్నం చేయండి. వెళ్లి మంచి పుస్తకాలను  ఎంపిక చేసుకోండి. సెలవులు పూర్తయ్యేలోపు వాటిని చదవడం పూర్తి చేయండి.సామాజిక సేవా కార్యమ్రాల్లో పాల్గొనండి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు