రారండోయ్‌ 

4 Mar, 2019 00:41 IST|Sakshi
  • కేంద్ర సాహిత్య అకాడమీ ఇంగ్లిష్‌లో ప్రచురించిన తెలుగు రచయిత్రుల సమకాలీన కథాసంకలనం ‘బియాండ్‌ ద బ్యాక్‌యార్డ్‌’ ఆవిష్కరణ మార్చి 4న సాయంత్రం 5:30కు విజయవాడ మొగల్రాజపురంలోని మధుమాలక్ష్మి ఛాంబర్స్‌లో జరగనుంది. సంపాదకులు: సి.ఎల్‌.ఎల్‌.జయప్రద, పి.సత్యవతి, వి.ప్రతిమ. ఆవిష్కర్త: వసంత కన్నబిరాన్‌.
  • మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి శతజయంతి ఉత్సవాలు మార్చి 5న మధ్యాహ్నం 3 గంటలకు పల్లిపాలెం, తూర్పు గోదావరిలోనూ; అదేరోజు సాయంత్రం 5:30కు హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలోనూ; 9, 10 తేదీల్లో మధునాపంతుల ట్రస్టు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోనూ జరగనున్నాయి. 
  •  తెలంగాణ సాహిత్య సమాఖ్య మార్చి 6న రవీంద్ర భారతి సమావేశ మందిరంలో రశ్మిత పేరుతో ప్రత్యేక మహిళా కవి సమ్మేళనం నిర్వహించనుంది.
  •  తెలంగాణ సాహిత్య అకాడమి కావ్య పరిమళంలో మార్చి 8న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో సినారె ‘నాగార్జున సాగరం’పై డాక్టర్‌ టి.గౌరీశంకర్‌ ప్రసంగిస్తారు.
  • తెలంగాణ అరసం ద్వితీయ మహాసభలు మార్చి 9, 10 తేదీల్లో ఆదర్శ న్యాయ కళాశాల, హన్మకొండలో జరగనున్నాయి. 9న ఉదయం తొమ్మిదింటికి ప్రారంభమయ్యే సభలో ప్రసంగాలు, పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనం ఉంటాయి.
  • డాక్టర్‌ పసునూరి రవీందర్‌ కవిత్వం ‘ఒంటరి యుద్ధభూమి’ ఆవిష్కరణ మార్చి 10న సాయంత్రం 5 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఆవిష్కర్త: గోరటి వెంకన్న. నిర్వహణ: మట్టి ముద్రణలు.
  • వాణిశ్రీ(సీహెచ్‌ శివరామప్రసాద్‌)కి ‘సహస్ర కథానిధి’ బిరుదును సింహప్రసాద్‌ సాహిత్య సమితి మార్చి 10న తెనాలిలో ప్రదానం చేయనుంది.
  • కథాప్రకాశం పేరుతో ప్రకాశం జిల్లా రచయితలు 2018లో రాసిన కథలతో సంకలనం తేవాలని గుండ్లకమ్మ రచయితల వేదిక సంకల్పించింది. జిల్లాతో అనుబంధం ఉన్న కథకులందరినీ కథల్ని పంపాల్సిందిగా కోరుతోంది. ఫోన్‌: 9989224280
     
మరిన్ని వార్తలు