లింగమయ్య పిలిస్తే కష్టం తెలియదయా!

20 Apr, 2016 00:32 IST|Sakshi
లింగమయ్య పిలిస్తే కష్టం తెలియదయా!

అర్జునుడు తపస్సు చేసిన దీక్షావనం  పరమేశ్వరుడు వరాలిచ్చిన పుణ్యస్థలి కృంగదీసే రోగాలకు ఔషధగని పసిపాపల నుంచి పండువృద్ధుల దాకావస్తున్నాం లింగమయ్యా అంటూ  నల్లమల అడవుల్లో అద్భుతమైన సాహసయాత్ర .. సలేశ్వరం యాత్ర...

 

ఎత్తయిన కొండగుట్టలు.. పచ్చని చెట్లు..పక్షుల కిలకిలరావాలు.. జాలువారే జలపాతాలు.. ఆరుదైన వన్యప్రాణులతో అలరారే నల్లమలలో వేయి అడుగుల లోతైన లోయులో కొలువైన సలేశ్వరం (లింగమయ్య) దర్శనం ఒక వుహత్తర ఘట్టం. అత్యంత ప్రవూద భరితమైన కొండ చరియుల వూర్గంలో కేవలం పాదం మోపే స్థలంలో ప్రయాణించాలి. ప్రతి ఏటా ఏప్రిల్ వూసంలో వచ్చే చైత్ర పూర్ణివు రోజున భక్తులు లింగమయ్యను భక్తిశ్రద్ధలతో దర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. నాటినుంచి ఐదు రోజుల పాటు శ్రీ రావులింగేశ్వర స్వామి నావుస్మరణతో నల్లవుల ప్రాంతం వూరుమోగుతుంది. నల్లమలలో వివిధ రోగాల నివారణకు ఉపయోగపడే మూలికలు లభిస్తాయి. ఇక్కడ వెయ్యి అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం కన్నుల పండువ చేస్తుంది. ఈ నీటిజాలు నల్లమల లోపలిభాగం నుంచి వస్తుండడంతో ఈ జలం దీర్ఘకాలిక రోగాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని భక్తుల నవ్ముకం. ఈ ప్రాంతంలోనే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడని ప్రతీతి.

 
వెయ్యి అడుగుల లోతులో.. లింగవుయ్యు దర్శనం కోసం 200 అడుగుల లోతున పదునైన రాళ్లతో కూడిన గుట్టను దిగడంతో సలేశ్వర ప్రయూణం ఆరంభవువుతుంది. గుట్టను దిగిన అనంతరం దాదాపు ఆరు వందల అడుగుల ఎత్తు ఉండే వురో గుట్టను ఎక్కాల్సి ఉంటుంది. సువూరు వేరుు అడుగులకు పైగా లోతున్న లోయువైపు  కొండ చరియులను ఆధారంగా చేసుకుని భక్తులు రాత్రివేళ ప్రయూణిస్తారు.

 
పిడికెడు శివలింగం..

కేవలం పిడికెడు ఎత్తు గల శివలింగం.. దానిమీద ఇత్తడితో చేసిన పడగ ఒక్కటే ఇక్కడ పూజలందుకునేది. చెంచులే ఇక్కడ ప్రధాన పూజారులు. ఉత్సవాలు జరిగే 5 రోజుల పాటు లక్షలాది వుందితో నల్లవుల అడవి ఈనినట్లుగా అనిపిస్తుంది. ఈ ఉత్సవాలు అరుున తర్వాత నిర్జనప్రదేశమే!

 

గుండంలో స్నానం చేస్తే సర్వరోగాలు మాయం
సలేశ్వర క్షేత్రంలో కొండల నడుమ దాదాపు వెయ్యి అడుగుల ఎత్తు నుంచి జలపాతంలో పడే నీటిలో స్నానం చేస్తే సర్వరోగాలు మటుమాయం కావడమే గాక, ఆయుష్షు పెరుగుతుందని విశ్వాసం. ఈ లోయ మార్గంలో ఒక్కొక్కరు మాత్రమే నడవడానికి దారి ఉంటుంది. లింగాలలో జరిగే శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాల సమయంలోనే ఈ క్షేత్రాన్ని భక్తులు దర్శించుకోవడం ఆనవాయితీ.


ఈమార్గంలో చూడదగిన ప్రదేశాలు... మల్లెల తీర్థం ... ప్రకృతి ప్రియులను ఆకట్టుకోవడంలో ప్రధానమైంది మల్లెలతీర్థం.  సూర్యకిరణాలకు చోటివ్వని చల్లని ప్రదేశమైన ఈ తీర్థానికి మతాలతో సంబంధం లేకుండా అందరూ ప్రకృతి ఒడిలో సేదతీర్చుకుంటారు. 500 అడుగుల ఎత్తు నుంచి నిరంతరం హోరెత్తుతూ దూకే జలధార మూడు సరస్సులను నింపుతూ నల్లమల అడవి గుండా కృష్ణానదిలో కలుస్తుంది. - బండారు శ్రీనివాస్, అచ్చంపేట

 

 
సలేశ్వరం ఎలా వెళ్తారంటే...

సలేశ్వర క్షేత్రానికి వెళ్లడానికి రెండు వూర్గాలు ఉన్నాయి. అచ్చంపేట - శ్రీశైలం జాతీయ రహదారిలోని ఫరహాబాద్ చౌరస్తా నుంచి రామ్‌పూర్ చెంచుపెంట (అప్పాపూర్ మార్గంలో40 కిలోమీటర్ల వరకు వెళ్తే) చేరుకుంటే అక్కడినుంచి క్షేత్రం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలా కాకుండా బల్మూర్, లింగాల -అప్పారుుపల్లి ద్వారా వెళ్లొచ్చు.

 
ఎక్కడినుంచి ఎంత దూరం...

హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిలోని మన్ననూర్ అనంతరం ఫర్హాబాద్ చౌరస్తా వస్తుంది. ఇక్కడి నుంచి 31 కి.మీ. దూరంలో దట్టమైన అటవీ మార్గంలో సలేశ్వరం క్షేత్రం ఉంటుంది.  దూరం: హైదరాబాద్ నుంచి 186 కి.మీ, మహబూబ్‌నగర్ నుంచి 151కి.మీ, అచ్చంపేట నుంచి 61 కి.మీ, మన్ననూర్ నుంచి 46 కి.మీ.

 

నల్లమల కొండల్లో నివసిస్తుస్న చెంచు జనాభా కేవలం 50 వేల లోపే. వేల సంవత్సరాలుగా స్వయం సమృద్ధితో, స్వయం పాలనలో జీవించిన వీరు తెలుగు రాష్ట్రాల విభజనకు, దాని పర్యవసానాలకు లోనవుతున్నారు. వీరి నివాస ప్రాంతాల్లోనే ప్రస్తుత శ్రీశైలం, అహోబిలం, ఉమామహేశ్వరం, మద్దిమడుగు, బౌరాపూర్, సలేశ్వరం, లొద్దిమల్లయ్య, కదలీవనం, అక్కమహాదేవి గుహలు, భీముని కొలను, ఇష్టకామేశ్వరి, మల్లెలతీర్థం లాంటి    క్షేత్రాలున్నాయి. కేస్తాపూర్ నాగోబాజాతర, సమ్మక్క - సారక్కల మేడారం జాతర జరిగేది ఇక్కడే. చెంచుల ఆడపడుచు ధీరవనిత బౌరమ్మ జ్ఞాపకార్థం మార్చి మొదటివారంలో ‘చెంచుల పండుగ’ (పాలమూరు) జరిగింది. ఏప్రిల్ 19 నుంచి 23 వరకు ఐదురోజులపాటు  ఏడాదికి ఒక్కసారి వచ్చే ‘లింగమయ్య ఉత్సవాలు’ సలేశ్వరంలో జరుపుకోబోతున్నాం. ఈ పండుగల సందర్భంగా చెంచులు వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు పాటిస్తారు. వాటిని వచ్చే తరాల వారికి  అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆదివాసులు ఎంతో నిష్టగా జరుపుతారు. ఈ సందర్భంగా వీళ్లు భూమిని, ఆకాశాన్ని, నీటిని, గాలిని, నిప్పును, చెట్టును, రాళ్లను చివరికి తమ ఇంటికి వచ్చిన పంటను తమదైన పద్ధతిలో పూజిస్తారు. ‘మీరు బాగుండాలి - మేం బాగుండాలి, అందరినీ సమానంగా చూడుస్వామి’ అని చెంచులు చేసే ప్రార్థన అందరికీ కనువిప్పు. - డా.రాంకిషన్, సలేశ్వరం క్షేత్రం ఉన్న అప్పాయపల్లి గ్రామవాస్తవ్యులు

 

మరిన్ని వార్తలు