నడుము చుట్టూ నలుపు

6 May, 2015 23:11 IST|Sakshi
నడుము చుట్టూ నలుపు

దిసీజ్ నాట్ ఏ బ్లాక్ బెల్ట్

పురుషుల్లో అయితే బెల్ట్ పెట్టుకునే చోట, మహిళల్లో నడుము చుట్టూ నాడా కట్టుకునే చోట నల్లగా కనిపించడం సహజం. ఆ నలుపును నివారించే మార్గాలివే...  నడుముకు బెల్టు పెట్టుకునే చోట /నాడా కట్టుకునే చోట గట్టిగా లాగి, బిగించి కట్టకండి. సౌకర్యంగా ఉండే కంప్రెషన్ ఎలాస్టిక్ నాడాలు వాడండి   మరీ ఎక్కువసేపు అదేపనిగా నిలబడి/కూర్చొని ఉండటం తగదు. ప్రతి గంటకు ఒకసారి కనీసం 5 - 10 నిమిషాలపాటైనా నడవాలి  క్యాలరీలు తక్కువగా ఉండి, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.  మహిళలు ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉండే గర్భనిరోధక మాత్రలను నివారిస్తే మేలు.

ఎందుకంటే ఈ మాత్రలలలోని ఈస్ట్రోజెన్ వల్ల కాళ్లలోని రక్తనాళాలు వెడల్పు అయ్యి, రక్తప్రసరణ ఎక్కువగా అవుతుంది.  ఈ క్రమంలో నడుము చుట్టూ బిగుతుగా కట్టడం రక్తప్రసరణకు అడ్డంకిగా మారి నలుపు రావచ్చు.  ఇక మహిళలైనా, పురుషులైనా పడుకునే సమయంలో కాళ్ల కింద తలగడ పెట్టుకుని, అవి పడక నుంచి 10 అంగుణాల పైన ఉండేలా జాగ్రత్త తీసుకుంటే నడుము చుట్టూ ఉన్న నల్ల మరకలే కాకుండా, గుండెకూ తగినంత రక్తప్రసరణ తేలిగ్గా అవుతుంది.
 

మరిన్ని వార్తలు