ఆ నేడు 30 సెప్టెంబర్, 1993

29 Sep, 2015 22:55 IST|Sakshi
ఆ నేడు 30 సెప్టెంబర్, 1993

ప్రళయం!
 
ప్రజలు గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు, భూమిని తొలుచుకొచ్చిన రాక్షసుడెవరో... నిర్దయగా మీద పడి ప్రాణాలు తీసినట్లు వచ్చింది ఆ భూకంపం! అప్పటి వరకు నమ్మకంగా ఉన్న మిత్రుడెవరో, హఠాత్తుగా వికటాట్టహాసం చేస్తూ విరుచుకుపడ్డట్లు వచ్చింది...  ఆ మాయదారి భూకంపం!! తెల్లవారు జామున వచ్చిన ఈ భూకంపం మహారాష్ట్రలోని లాతూరు, ఉస్మానాబాద్ జిల్లాల్లో విధ్వంసాన్ని సృష్టించింది. భూకంపప్రభావానికి 52 ఊళ్లు ధ్వంసం అయ్యాయి. సుమారు పది వేలమందికి పైగా చనిపోయారు. ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చనేది కూడా ఒక అంచనా.

 ‘‘మా ఊరు శ్మశానంగా మారిపోయింది’’ అన్నాడు ఆనాటి కిల్లరి సర్పంచ్. ఊళ్లు ఊళ్లుగా కాక...పెద్ద బీడుభూములుగా, నిర్జన ప్రాంతాలుగా మారిపోయాయి. చెరువులు... కన్నీటి సంద్రాలు అయ్యాయి. భారతదేశాన్ని కాదు...్ర పపంచాన్నే కుదిపేసిన ఈ భూకంపం చరిత్ర పుటల్లో ఆరని కన్నీటి చుక్కగా నిలిచింది.
 

మరిన్ని వార్తలు