ముంజల వారి విందు

17 May, 2019 23:42 IST|Sakshi

ఐస్‌ను ఫ్రై చేసుకుని తింటే ఎలా ఉంటుంది?అడిగినవారికి మైండ్‌ లేదనిపిస్తోంది కదూ!కానీ మీకు తెలుసా... ఫ్రైడ్‌ ఐస్‌ క్రీమ్‌ దొరుకుతుందని!అలాగే చల్లటి ముంజలను వేడివేడిగా వండుకుని తినొచ్చు!ప్రయత్నించండి! వేడివేడిగా తినండి.కడుపును చల్లబరచండి.

నొంగు పాల్‌ 
కావలసినవి: లేత ముంజలు – 6 (తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి); పాలు – 2 కప్పులు; పంచదార/తేనె – 1 టేబుల్‌స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను

తయారీ:
►ఒక పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి బాగా కాగిన తరవాత, మంట బాగా తగ్గించి, పాలు మూడు వంతులయ్యే వరకు మరిగించాలి
►పంచదార/తేనె జత చేసి బాగా కలియబెట్టాలి
►ఏలకుల పొడి జత చేసి ఆపకుండా కలుపుతుండాలి
►అన్నీ బాగా కరిగిన తరవాత దింపి చల్లార్చాలి
►ముంజలను చేతితో మెత్తగా మెదిపి, మరిగించిన పాలకు జత చేసి బాగా కలపాలి
►ఫ్రిజ్‌లో ఉంచి రెండు మూడు గంటల తరవాత బయటకు తీసి, చల్లగా అందించాలి. (నన్నారి, పిస్తా, రోజ్, చాకొలేట్, కేసర్‌ టూటీ ఫ్రూటీలతో కూడా తయారు చేసుకోవచ్చు)

ముంజలు మునగ కాడ కర్రీ
కావలసినవి: లేత ముంజల గుజ్జు – 2 కప్పులు; లేత మునగకాడ ముక్కలు – ఒక కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; పనీర్‌ తురుము – పావు కప్పు; గసగసాలు + జీడి పప్పు + ఎండు కొబ్బరి పేస్ట్‌ – ఒక టేబుల్‌ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 6; నూనె – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు.

తయారీ:
►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చి మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి
►మునగ కాడల ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి
►టొమాటో తరుగు, ఉల్లి తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి కొద్దిసేపు వేయించాలి
►ముంజల గుజ్జు జత చేసి బాగా కలపాలి
►కొద్దిగా నీళ్లు, తగినంత ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి
►కొద్దిగా ఉడికిన తరవాత పనీర్‌ తురుము, గసగసాలు + జీడి పప్పు + ఎండు కొబ్బరి పేస్ట్‌ జత చేసి కలియబెట్టి, మరి కొద్ది సేపు ఉడికించాలి
►కొత్తిమీర తరుగుతో అలంకరించి దింపేయాలి
►వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.

ముంజల డ్రింక్‌
కావలసినవి:  ముంజలు – 8; పాలు – రెండు కప్పులు; నీళ్లు – తగినన్ని; పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు; రూహ్‌ అఫ్జా – ఒక టేబుల్‌ స్పూను.

తయారీ:
►మిక్సీ జార్‌లో నాలుగు తాటి ముంజలు వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి
►మిగిలిన ముంజలను చాకుతో సన్నగా కట్‌ చేసి పక్కన ఉంచాలి
►మిక్సీ జార్‌లో పాలు, కొద్దిగా నీళ్లు, పంచదార, రూహ్‌ అఫ్జా, ముంజల గుజ్జు వేసి బాగా మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, గ్లాసులోకి తీసుకోవాలి
►ముంజ ముక్కలు, ఐస్‌ ముక్కలు జత చేసి చల్లగా అందించాలి.

ముంజల బజ్జీ
కావలసినవి: కొద్దిగా ముదిరిన ముంజలు – 10; సెనగ పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; ధనియాల పొడి – ఒక టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ:
►ముంజల తొక్క తీసి, నీరు వేరు చేయాలి
►ఒక గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, మిరప కారం, ఉప్పు వేసి బాగా కలపాలి
►తగినన్ని నీళ్లు జత చేసి బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోవాలి
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ముంజలను పిండిలో ముంచి బజ్జీల మాదిరిగా వేయాలి
►రెండు వైపులా దోరగా కాలిన తరవాత పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి
►టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.

తాటి ముంజల పొట్టు చట్నీ
కావలసినవి: ముంజల పొట్టు – ఒక కప్పు; మినప్పప్పు – 3 టేబుల్‌ స్పూన్లు; కంది పప్పు – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 4; చింత పండు – నిమ్మకాయంత; ఎండు మిర్చి – 5; లవంగాలు – 4; ఎండు కొబ్బరి ముక్కలు – అర కప్పు; ఉప్పు – ఒక టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను

తయారీ:
►ముంజల పొట్టును నీళ్లలో నానబెట్టాలి (లేదంటే రంగు మారిపోతుంది)
►స్టౌ మీద బాణలి వేడయ్యాక మినప్పప్పు, కంది పప్పు, వెల్లుల్లి, ఎండు మిర్చి, చింత పండు కొబ్బరి ముక్కలు, లవంగాలు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించి దింపేసి, ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి
►ముంజల పొట్టులోని నీటిని పూర్తిగా ఒంపేయాలి
►పొట్టును ఒక ప్లేట్‌లో ఉంచాలి
►స్టౌ మీద బాణలిలో పావు టీ స్పూను నూనె వేసి కాగాక ముంజల పొట్టు, ఉప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి
►ముందుగా పోపు సామానును మిక్సీలో వేసి మెత్తగా చేశాక, ముంజల పొట్టు జత చేసి మరోమారు మెత్తగా అయ్యేవరకు తిప్పి, గిన్నెలోకి తీసుకోవాలి
►ఇది చపాతీ, దోసె, బ్రెడలలో నంచుకుని తినొచ్చు, అన్నంలోకి కూడా రుచిగా ఉంటుంది.

తాటి ముంజల కూర
కావలసినవి: నూనె – ఒక టేబుల్‌ స్పూను; బిర్యానీ ఆకులు – 2; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి –  6; ఉప్పు – తగినంత; ముంజలు – 10 (కొద్దిగా ముదురుగా ఉండాలి); పసుపు – పావు టీ స్పూను; కారం – అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను

తయారీ:
►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, రెండు బిర్యానీ ఆకులు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి
►ఉల్లి తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి
►కొద్దిగా ఉప్పు జత చేయాలి
►తరిగిన ముంజలు వేసి బాగా కలపాలి
►తగినంత పసుపు, కారం వేసి మరోమారు కలియబెట్టాలి
►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేయాలి
►కొద్దిగా నీళ్లు పోసి, మూత పెట్టి, ముంజలు మెత్తబడే వరకు ఉడికించాలి
►మూత తీసి మరోమారు కలియబెట్టాలి
►ధనియాల పొడి, కొత్తిమీర తరుగు జత చేసి మరోమారు కలియబెట్టి దింపేయాలి.

తాటి ముంజల కుర్మా
కావలసినవి: తాటి ముంజలు – 12; ఉప్పు – తగినంత; కారం – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; పోపు సామాను –  ఒక టీ స్పూను (ఆవాలు, జీలకర్ర); ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 3; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను ; క్యారట్‌ తరుగు – పావు కప్పు; నువ్వులు + జీడి పప్పు పేస్ట్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; పెరుగు – అర కప్పు; కొత్తిమీర – అర టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను.
తయారీ:
►ముంజలను ఒక ప్లేట్‌లో ఉంచి, వాటి మీద ఉప్పు, పావు టీ స్పూను కారం, పావు టీ స్పూను పసుపు చల్లి, అన్నిటికీ అంటేలా చేతితో సరిచేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
►ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు కలపాలి
►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేయాలి
►క్యారట్‌ తరుగు వేసి మరోమారు కలపాలి
►టొమాటో తరుగు జత చేసి కలియబెట్టాలి
►కొద్దిగా నీళ్లు పోసి మరోమారు కలిపి, మూత ఉంచి ఉడికించాలి
►జీడిపప్పు, నువ్వుల పేస్ట్‌ వేసి కలిపి ఉడికించాలి
►తగినంత ఉప్పు జత చేయాలి
►కారం, పసుపు, ధనియాల పొడి వేసి మరోమారు కలపాలి
►పెరుగు జత చేసి కలియబెట్టాలి
►కొద్దిగా నీళ్లు జత చేయాలి
►ముంజలను జత చేసి ఉడికించాలి
►గరం మసాలా, కొత్తిమీర తరుగు జత చేసి మూత ఉంచాలి
►కొద్దిగా ఉడికిన తరవాత మూత తీసి మరోమారు కలియబెట్టాలి
►ఉడికిన కుర్మాను ఒక పాత్రలోకి తీసుకుని కొత్తిమీరతో అలంకరించాలి. 

తాటి ముంజల పొట్టు కర్రీ
కావలసినవి: తాటి ముంజల పొట్టు – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్‌ స్పూను.
పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; ఉల్లి తరుగు – అర కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; కారం – ఒక టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను

తయారీ:
►స్టౌ మీద మందపాటి గిన్నె ఉంచి, అందులో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి
►తాటి ముంజల పొట్టు వేసి ఉడికించాలి
►చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు జత చేసి కలియబెట్టి బాగా ఉడికించి దింపేయాలి
►నీటిని వడకట్టి తీసేయాలి
►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాచాలి
►జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండు మిర్చి, పచ్చి సెనగ పప్పు వేసి వేయించాలి
►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►కరివేపాకు వేసి మరోమారు వేయించాలి
►పసుపు జత చేయాలి
►ముంజల పొట్టు జత చేసి బాగా కలపాలి
►కారం, గరం మసాలా వేసి మరోమారు కలిపి, దింపేయాలి.


 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

హెచ్ఐవీకి మందు దొరికింది!

అర్బన్‌ నోస్టాల్జిస్ట్‌లు

పరిసరాలను ముంచెత్తేసిన పెళ్లి!

ఆ గర్భిణి... కళ్లలో మెదిలేది..

వెయిట్‌ లిఫ్టింగ్‌తో గుండెకు మేలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌