ఢీకొట్టండి... పారిపోండి!

13 Aug, 2014 23:47 IST|Sakshi
ఢీకొట్టండి... పారిపోండి!

 రోడ్డుపై వేగంగా కారు నడపాలని, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి అడ్డదిడ్డంగా దూసుకుపోవాలని అనిపిస్తుందా? నిజంగా అలా చేస్తే గనక.. ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు వడ్డిస్తారు. ప్రమాదాలు జరిగి మనకు దెబ్బలు తగలడమో, అవతలివారికి తగిలితే జైలుకు పోవడమో ఖాయం. అదే ఫోన్‌లో అయితే? మన కారు.. మన ఇష్టం. నచ్చిన వేగంతో మెచ్చిన రోడ్డుపై అడ్డదిడ్డంగా దూసుకుపోవచ్చు. హెవీ ట్రాఫిక్‌లో ప్రత్యేకమైన రంగుల్లోనే ఉన్న వాహనాలు ఢీకొడుతూ స్పోర్ట్స్ కారుతో నడిరోడ్డుపై వీరవిహారం చేయొచ్చు.

లేదా కామ్‌గా, చాకచక్యంగా డ్రైవ్ చేయొచ్చు. దీనికి టిల్ట్ లేదా టచ్.. రెండు ఆప్షన్లూ ఉన్నాయి. అందువల్ల మనం ఉన్న పొజిషన్‌కు అనుగుణంగా ఈ గేమ్ తనకు తాను టిల్ట్(రొటేట్) అవుతుంది. ఈ ఉచిత ఆప్ ఐఫోన్, ఐపాడ్, ఐపాడ్‌టచ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కావాలంటే ఆపిల్ ఆప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు