కుంకుమపువ్వుతో దేహానికి దృఢత్వం

6 Oct, 2014 23:34 IST|Sakshi
కుంకుమపువ్వుతో దేహానికి దృఢత్వం

కుంకుమ పువ్వు... ఈ పేరు వినగానే సంపన్నత గుర్తుకు వస్తుంది. సుగంధద్రవ్యాల్లో అత్యంత ఖరీదైనది కావడంతో కుంకుమ పువ్వు అంటే సంపన్నులు వాడే దినుసు అనే భావనతోపాటు బంగారు సుగంధద్రవ్యం అనే పేరు కూడా స్థిరపడిపోయింది. ఇంతకీ కుంకుమ పువ్వు వల్ల ప్రయోజనాలేంటంటే...
 
జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది, ఆహారం తీసుకోవాలనే కోరికను కలిగిస్తుంది. దేహంలో అన్ని భాగాలకూ రక్తం సక్రమంగా సరఫరా అయ్యేటట్లు చేస్తుంది. అందుకే దీన్ని కాలేయం, మూత్రపిండాలు, మూత్రాశయ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
 
కుంకుమ పువ్వు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయులను, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తుంది. కాబట్టి గుండె వ్యాధులు ఉన్న వారు రోజుకు రెండు లేదా మూడు రేకలను నీటిలో కానీ, పాలలో కానీ నానబెట్టి తీసుకుంటే మంచిది.
     
ఇందులో చర్మాన్ని కాంతిమంతం చేసే గుణం ఉంది. కాబట్టి సౌందర్య సాధనాల తయారీలో కుంకుమ పువ్వును ఉపయోగిస్తారు. ఒక టీ స్పూన్ పాలలో ఒక కుంకుమ పువ్వు రేకను నానబెట్టి ఆ పాలను ముఖానికి రాస్తుంటే ముఖం మీద మచ్చలు పోతాయి.
     
గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే జీవక్రియలకు తగినంత ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతుంది.

- ఉషశ్రీ, న్యూట్రిషనిస్ట్, కేర్ హాస్పిటల్

మరిన్ని వార్తలు