కేవలం టాయిలెట్స్ మాత్రమే సరిపోవు...

8 Feb, 2016 23:17 IST|Sakshi
కేవలం టాయిలెట్స్ మాత్రమే సరిపోవు...

గ్రామీణ భారతం
 
గ్రామీణ భారతావనికి కేవలం అప్పటికప్పుడు ఇచ్చే పరిష్కారాల కంటే నైపుణ్యాల అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ, ఎదగాలనే కాంక్ష, ఆత్మవిశ్వాసం వంటివే అవసరం.

ఊహాలోకం, వాస్తవం
ఎన్నో ఏళ్లుగా భారతదేశంలోని పల్లెలను ఆవరించి ఉన్న పేదరికం నుంచి విముక్తి కోసం స్కూళ్లలో భవనాలు నిర్మించడం, మరుగుదొడ్లు కట్టించడం వంటివి సరిపోతాయా? నిజానికి మన దేశానికి అంతకంటే ఎక్కువ అవసరం. మన నిజమైన అంతర్గత శక్తులను వెలికితీయకుండా తూతూమంత్రంగా కొన్ని పరిష్కారాలు సూచిస్తే సరిపోతుందా? నిజానికి గ్రామీణ భారతం పూర్తిగా బాగుపడాలంటే ఇంతకంటే ఎక్కువ అవసరం. స్వాతంత్య్రం వచ్చాక దాదాపు 68 ఏళ్ల తర్వాత కూడా ఎక్కడో అమలు చేసిన నమూనా ప్రయోగాలకంటే భారతీయ పల్లెలకు మరింత ఎక్కువ కావాలి.

గత 33 ఏళ్లుగా ప్రముఖ పారిశ్రామికవేత్త రోనీ స్క్రూవాలా , ఆయన భార్య జరీనా తమ స్వీడిష్ ఫౌండేషన్ సహకారంతో  మహారాష్ట్రలోని ఎన్నెన్నో పల్లెల్లో తిరుగుతున్నారు. వాళ్ల అభిప్రాయం ప్రకారం ఏదో నమూనా ఫ్రేమ్‌వర్క్ కంటే, అక్కడి స్థానికంగా తెలివితేటలను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు. మన దేశ జనాభాలో దాదాపు  సగానికంటే ఎక్కువ పల్లెల్లోనే ఉంది. అందుకే ఐదొందల నుంచి వెయ్యి పల్లెలను తీసుకొని, ఏదో అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తే అది అంత ప్రభావవంతంగా ఉండదని ఆ
దంపతుల భావన.

వారి ఉద్దేశం ప్రకారం:
మనం నిజమైన అభివృద్ధినీ, గ్రామీణ ప్రాంతాల్లో  మరింత మెరుగైన పరిస్థితులను కావాలనుకుంటే మనం నాలుగు అంశాలను కోరుకోవాలి. అవి... నమ్మకం (ట్రస్ట్), సహానుభూతి (ఎంపథీ), యువతలో ఎదగాలనే ఆకాంక్ష (యాస్పిరేషన్), వాళ్లు మరింత బలోపేతం కావడం (ఎంపవర్‌మెంట్). మనలో ఉన్న  అపనమ్మకం అనే అగాధాన్ని దాటేంతగా బలం సమకూర్చుకోవాలి. అయితే యువతలో ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్పడం అనేది రాత్రికి రాత్రి అయ్యే పనికాదు.

చిన్న చిన్న అడుగులు... పెద్ద ప్రభావం...
పైన పేర్కొన్న నాలుగంశాలూ పాటిస్తే, ఆ తర్వాత మన గ్రామీణ జీవనచిత్రంలో మరింత మెరుగైన మార్పులు వస్తాయి. గ్రామీణుల్లో ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. చాలా పల్లెల్లో తాగడానికి అవసరమైన నీళ్ల కోసం... ఏదో రెండు పంపులు వేయడం కంటే...  దానికి 20 రెట్లు ఎక్కువగా ఖర్చయినా, శాశ్వత మంచినీటి వసతి కల్పించాలి. మనలను ఎయిత్, నైన్త్, టెన్త్ చదివించడం కంటే టెన్త్ చదివాక ఏం చేస్తామనే ప్రశ్నకు సమాధానం వెతకాలి. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో టెన్త్ తర్వాత గ్రాడ్యుయేషన్ వరకూ చదివేవారు తగ్గుతున్నారు. మన చిన్నారులు, యువత కోసం నిన్నటి కంటే మెరుగైన రేపటిని కల్పించాలి.

మనకు పుష్కలమైన మానవ వనరులున్నాయి. అయితే మనకు నిజంగా లేనిది నైపుణ్యంలో మెరుగుదల, వృత్తిపరమైన శిక్షణ, ఎదగాలనే తీవ్రమైన కాంక్షను యువతలో కల్పించడం, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడం. మన పల్లెల్లో నిక్షిప్తమై ఉన్న, నిగూఢ నైపుణ్యాలకు పదును పెట్టేలా చేయాలి. మన భారతీయ పల్లెలోని పనిచేసే సేనలను, వర్క్‌ఫోర్స్‌ను మరింత బలోపేతం చేయాలి.

మరిన్ని వార్తలు