శీతాకాలంలో పొడిచర్మానికి చికిత్స!

30 Dec, 2015 19:13 IST|Sakshi
శీతాకాలంలో పొడిచర్మానికి చికిత్స!

బ్యూటిప్స్
 
{పతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాయాలి. అలాగే పొడిబారిన మోచేతులు, పాదాలు వంటి శరీర భాగాల్లోనూ రాయాలి. పొడిచర్మాన్ని రోజుకు పదినిమిషాలు హాట్‌థెరపీ ఇవ్వాలి. గోరువెచ్చటి నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇదే హాట్‌థెరపీ. ఒక కోడిగుడ్డు సొనలో, ఒక టీ స్పూన్ కమలారసం, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి.
     
బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, మెడ నల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపు వదులుతుంది. పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్‌సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. ఆయిల్‌ను యథాతథంగా ఒంటికి రాసి మర్దన చేస్తే సరిపోతుంది. ఇది ఇప్పుడు అన్ని సూపర్‌మార్కెట్లలోనూ దొరుకుతోంది. ఆన్‌లైన్‌లో కూడా కొనుక్కోవచ్చు. రకరకాల కాంబినేషన్‌లతో ప్యాక్‌లు తయారు చేసుకోవడానికి సాధ్యం కానప్పుడు చర్మానికి స్వచ్ఛమైన ఆముదం లేదా అవొకాడో ఆయిల్ రాసి సున్నితంగా మర్దన చేయాలి.
 

మరిన్ని వార్తలు