మాట సాయమూ మహోపకారమే!

28 Jun, 2017 23:41 IST|Sakshi
మాట సాయమూ మహోపకారమే!

ఆత్మీయం

పురాణాలు పద్ధెనిమిది. ఈ పురాణాలలోని సారాన్నంతటినీ పిండగా పిండగా, చివరకు తేలేది ఒక్కటే. పరోపకారం పుణ్యప్రదం. పరపీడనం పాపహేతువు. అంటే ఈ అన్ని పురాణాలలోని కథలూ, ఉపకథలూ చదివి, వాటి సారాన్ని చక్కగా వంటబట్టించుకుంటే మనకు లె లియవచ్చేది ఏంటంటే... ఇతరులను పీడించడం, బాధించడం, హింసించడం... ఇటువంటì  వాటివల్ల పాపం కలుగుతుంది. అంటే అలా చేసిన వారికి కీడు జరుగుతుంది. అలా కాకుండా, తనకు ఉన్నంతలోనే ఇతరులకు ఉపకారం అంటే మేలు చేయడం పుణ్యాన్ని కలిగిస్తుంది.

ఉపకారమనేది డబ్బు ద్వారానే కాదు, మాటసాయం లేదా కష్టాలలో ఉన్నవారికి వారికి హితవు కలిగేలా నాలుగు మంచి మాటలు చెప్పడం, అదీ చేతకాకపోతే అవతలి వారు చెప్పేదానిని ఓపిగ్గా వినడం కూడా పుణ్యప్రదమే. ఎందుకంటే, ఎదుటివారు మన బాధలను ఓపిగ్గా వింటున్నారనే భావన కూడా ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి. అందుకే కదా, ‘నీ సమస్యలు, బాధలు ఎదుటివారికి చెప్పుకుంటే సగమవుతాయి; నీ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటే రెట్టింపు అవుతుంది’ అని పెద్దలు అనేదీ, ఆంగ్ల సామెత పుట్టిందీనూ!

మరిన్ని వార్తలు