ప్రపంచంలోనే తొలి అణుప్రమాదం

9 Oct, 2015 23:07 IST|Sakshi
ప్రపంచంలోనే తొలి అణుప్రమాదం

 ఆ  నేడు 1957 అక్టోబర్ 10
 
అణుశక్తి అందుబాటులోకి వచ్చాక, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికన్ బలగాలు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబులు వేశాయి. అణుశక్తి సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో అప్పుడే తొలిసారిగా మానవాళికి అర్థమైంది. అది ప్రమాదం కాదు, ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంసం. నాలుగేళ్ల కిందట అదే జపాన్‌లోని ఫుకుషిమా అణుకేంద్రంలో సంభవించిన ప్రమాదం విధ్వంసానికి దారితీసింది. అయితే, అణుశక్తిని ఆయుధాల తయారీకి ఉపయోగించడం మొదలుపెట్టిన తొలినాళ్లలోనే బ్రిటన్‌లో అణుప్రమాదం సంభవించింది. ప్రపంచంలోనే ఇది మొదటి అణుప్రమాదం.

ఈ ప్రమాదం 1957లో సరిగా ఇదే రోజు జరిగింది. కంబర్లాండ్‌లోని అణుకేంద్రంలో ఈ ప్రమాదం ధాటికి మూడు రోజుల పాటు మంటలు ఎగసిపడ్డాయి. దీని ప్రభావానికి వందలాది మంది కేన్సర్ బారిన పడ్డారు. దాంతో ఇది చరిత్ర పుటలలో తొలి అణుప్రమాదంగా నిలిచిపోయింది.
 
 

మరిన్ని వార్తలు