ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు...

22 Mar, 2016 23:19 IST|Sakshi
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు...

ఈ భూభాగంలో అత్యంత ఆకర్షణీయమైనది, అద్భుత ఔషధ గుణాలు కలిగిది, సుగంధ ద్రవ్యాలలో అత్యంత ఖరీదైనది కుంకుమపువ్వు. ఈ పేరు వినగానే మనకు వెంటనే కాశ్మీర్ గుర్తుకు వస్తుంది. నిజానికి కుంకుమపువ్వు స్వస్థలం దక్షిణ ఐరోపా! అక్కడ నుంచే వివిధ దేశాలకు విస్తరించింది. గ్రీసు, స్పెయిన్, ఇరాక్, ఇటలీ, సిసిలీ, టర్కీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లోనూ దీన్ని ఎక్కువగా పండిస్తారు. అయితే, అన్నింటిలోకి కాశ్మీరీ కుంకుమపువ్వు నాణ్యమైనది. క్రీ.పూ. 500 సంవత్సరాలకు ముందే మన దగ్గర దీని ప్రస్తావన ఉంది.

వేదకాలపు సంస్కృతిలోనూ ప్రముఖమైన సౌందర్యపోషణ ద్రవ్యమిది. వంటకాలకు ప్రత్యేకమైన రంగు, రుచిని ఇస్తుంది. నాటి రాచరిక కాలపు దర్పణానికి చిహ్నం ఈ కుంకుమ పువ్వు. ఈ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, కొద్దిగా తియ్యగా ఉంటుంది. కుంకుమపువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారుచేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారుచేయాలంటే కనీసం రెండు లక్షల పూలు అవసరమవుతాయి.

 

    తిండి గోల

 

మరిన్ని వార్తలు