ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం, చైనా

19 Jan, 2014 03:34 IST|Sakshi
ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం, చైనా

 జనాభా              : 1,384,694,199(2013 అంచనా ప్రకారం)
 అధికార భాష    : చైనీస్
 కరెన్సీ              : యువాన్
 రాజధాని          : బీజింగ్
 
 చైనా... నవీన శిలాయుగంలో ఎల్లోనది ఒడ్డున పుట్టిందని చెప్పబడుతోంది.చైనా సంస్కృతి, తత్వశాస్త్రం, సాహిత్యం మొదలైనవి (1045 బిసి - 256 బిసి) చౌ రాజవంశం హయాంలో వృద్ధి చెందాయి. ప్రపంచంలోని భూవిస్తీర్ణంలో చైనా మూడవ స్థానంలో ఉంది. దాని వైశాల్యం  దాదాపు 9.6 మిలియన్ల చదరపు కి.మీ.
 
 కన్‌ఫ్యూషియస్
 ఒక దేశాన్ని ఎలా పాలించాలన్నది 2500 సంవత్సరాల క్రితమే కన్‌ఫ్యూషియస్ తన గ్రంథంలో రాశాడు. ఇప్పటికీ ఆ సూత్రాలనే ప్రజలు పాటిస్తున్నారు.
 
 ఫర్‌బిడెన్ సిటీ
 చాలాకాలం క్రితం ఈ పట్టణంలో చైనా చక్రవర్తి ఉండేవాడు. ఆయనను బయటకు రావడానికి అనుమతించేవారు కాదు. అలాగే సామాన్య ప్రజల్ని లోనికి రానిచ్చేవారు కాదు. పట్టణం చుట్టూ పదిమీటర్ల ఎత్తున పెద్ద గోడ ఉండేది.
 
 హాంగ్‌కాంగ్
 చైనాలోని అన్ని నగరాలకంటే చాలా బిజీగా వుండే నగరం హాంగ్‌కాంగ్. ఇక్కడివారు ఎంతో వేగంగా నడుస్తూ మాట్లాడుతుంటారు. అన్నింటా వేగమే!
 
 చైనీస్ ఒపేరా
 చైనీస్ ఒపేరాలో నృత్యం చేసేవారు ఒక కథాంశాన్ని నృత్యరూపంలో ప్రదర్శిస్తారు. వారు ఆయా పాత్రల్లో నటిస్తూ, పాడుతూ నృత్యం చేస్తారు. సింబాల్స్, డ్రమ్ముల వాదనతో ఈ నృత్యరూపకం చూడ్డానికి ఎంతో బావుంటుంది.
 
 డ్రాగన్ డ్యాన్స్
 ఇది చైనీయుల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని చేసే డ్యాన్స్. ఇందులో సింహాలు ఎర్రటి సంచుల కోసం పోట్లాడుకుంటాయి.
 
 టీ అంటే ప్రాణం
 వీరికి టీ అంటే  మహా ఇష్టం. అలాగే నూడుల్స్ అంటే
 కూడా చాలా ప్రీతి. వీటిని చాప్‌స్టిక్స్ సహాయంతో తింటారు.
 
 షావోలిన్ సన్యాసి
 షావోలిన్ సన్యాసులు కుంగ్‌ఫూ ప్రవీణులు. వీరిలో చాలామంది తమ ఆరో ఏటనే కుంగ్‌ఫూలో శిక్షణ పొందుతారు.
 
 సిల్క్‌రోడ్డు
 మూడువేల ఏళ్ల క్రితం వ్యాపారులు ఈ సిల్క్ రోడ్డు ద్వారానే చైనా చేరుకున్నారు. వారు బంగారం, దంతం, గాజు, మరెన్నో ఖరీదైనవజ్ర వైఢూర్యాలు తమ వెంట తెచ్చారు. వాటిని ఇచ్చి బదులుగా ఇక్కడి నుంచి చైనా సిల్క్, జేడ్ వస్త్రాలు, ఊలు మొదలైన వాటిని తీసికెళ్లారు.
 
 జేడ్ సూట్
 జేడ్ వస్త్రం కలిగి ఉంటే దురదృష్టం వదిలి పోతుందని చైనీయుల విశ్వాసం, కొందరు చైనా అందుకే చక్రవర్తులు మరణించిన తర్వాత వారి శవాలను ఈ జేడ్ వస్త్రంలో చుట్టి మరీ ఖననం చేసేవారు.
 
 పాండాలు
 
 చైనాలో పాండాలు ఎక్కువ ఉంటాయి. ఇవి వెదురు అడవుల్లో నివసిస్తాయి. పళ్లు కూడా తింటాయి కానీ ప్రధాన ఆహారం మాత్రం వెదురు కొమ్మలు, ఆకులే!
 
 గ్రేట్‌వాల్: గ్రేట్‌వాల్‌ను శత్రువుల నుంచి రక్షణ కోసం కిన్ చక్రవర్తి కట్టించాడు. అంతేకాదు...  మరణానంతరం ఆయన సమాధిని రక్షించేందుకు 700 మంది టైట సైనికులు ఉండేవారు.
 
 రెడ్ ప్యాకెట్: చైనీయుల నూతన సంవత్సరాది  సంబరాల్లో పిల్లలకు ఈ ఎర్ర రంగు సంచుల్ని ఇస్తారు. వీటిల్లో డబ్బులుంటాయి. ఈ రెడ్ ప్యాకెట్స్ అదృష్టాన్నిస్తాయని వాళ్ల నమ్మకం.

మరిన్ని వార్తలు