చూసినవాళ్లే ఎక్కువ

2 Jan, 2018 00:11 IST|Sakshi

చెట్టు నీడ 

సాధారణంగా దేవుడు కాంతి రూపంలో ప్రత్యక్షం అవుతాడని, అదే దైవ సాక్షాత్కారం అని అంటూ ఉంటారు. అయితే అది ‘కాంతి’ కాదు, ‘భ్రాంతి’ అని కొట్టిపడేసే ‘అప్రత్యక్ష’ వాదులూ ఉన్నారు. అప్రత్యక్షవాదులు అంటే.. దేవుడు ప్రత్యక్షం అయ్యాడంటే నమ్మనివాళ్లు. వాళ్లను అలా వదిలేస్తే.. దేవుడిని చూశామని, దేవుడితో మాట్లాడామని కొంతమంది చెబుతుంటారు. దేవుడంటే నమ్మకం లేనివాళ్లు కూడా, దేవుడిని చూశామని చెప్పినవాళ్లను నమ్మకుండా ఉండలేనంతగా గట్టిగా ఉంటాయి ఆ చెప్పేవాళ్ల అనుభవాలు. అసలు నమ్మకుండా ఉండడం ఎందుకు? ఎందుకంటే..  దేవుడు ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించడు కనుక. ఎవరెస్టు శిఖరం కనిపిస్తుంది. నయాగరా జలపాతం కనిపిస్తుంది. కశ్మీర్‌ లోయ కనిపిస్తుంది. దేవుడు అలా కనిపించడు.

అందుకే కనిపించని దేవుడిని ప్రత్యక్షంగా చూశామంటే, ‘నాకు ప్రత్యక్షం అయ్యాడూ’ అంటే ఎవరూ నమ్మరు. అయినా దేవుడు శిఖరంలానో, జలపాతంలానో, లోయలానో ఎందుకు కనిపించాలి? ఆయనది కనిపించని వేరే రూపం అనుకోవచ్చు కదా. అప్పుడు దేవుడిని సందేహించే పని ఉండదు. ఏ రూపమూ లేనివాడు ఏ రూపంలో కనిపించినా ‘చూడ్డానికి’ మనసు అంగీకరిస్తుంది.  అయితే దేవుడికి రూపం లేకుండా లేదు! ‘నమ్మకం’ ఆ రూపం. నమ్మకంలోంచి ఏర్పyì న రూపం! నమ్మకం ఒకటే. రూపాలు అనేకం. ఇలా ఆలోచిస్తే.. మన చుట్టూ దేవుణ్ణి చూడనివాళ్ల కంటే, దేవుణ్ణి చూసినవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. వీళ్లందరికీ ఏదో ఒక రూపంలో దేవుడు ప్రత్యక్షం అయ్యే ఉంటాడు.

మరిన్ని వార్తలు