ఈ మందులు ఇక వద్దు!

27 Jan, 2014 22:28 IST|Sakshi
ఈ మందులు ఇక వద్దు!

తలనొప్పి, కడుపు నొప్పి, కాళ్ల నొప్పులు... ఏ నొప్పి వచ్చినా వెంటనే గుర్తొచ్చే మాత్ర అనాల్జిన్. అయితే భారత వైద్యఆరోగ్య మంత్రిత్వ శాఖ గత ఏడాది జూన్‌లో ఈ మందును నిషేధించింది. దీనితోపాటు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉపయోగించే పియోగ్లిటజోన్, డిప్రెషన్‌ను తగ్గించే డెన్‌గ్జిట్ మందులను కూడా నిషేధించింది.

పియోగ్లిటజోన్‌ను దీర్ఘకాలం వాడకం వల్ల గుండె పని తీరు మందగించడంతోపాటు మూత్రాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. అనాల్జిన్, డెన్‌గ్టిట్ వాడకం వల్ల భవిష్యత్తులో దేహం అనారోగ్యాల పాలయ్యే ప్రమాదం ఉన్నట్లు గుర్తించడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు మందులను డెన్మార్క్ వంటి అనేక దేశాలు చాలా ఏళ్ల క్రితమే నిషేధించాయి.
 

మరిన్ని వార్తలు