ఎవరి సరదా వాళ్లది

11 Apr, 2014 23:27 IST|Sakshi

పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటారు... అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్ జేడ్ హెర్రిక్‌దో వింత పిచ్చి. పచ్చబొట్లు (టాటూ) అంటే చాలామందికి సరదా, కొందరికి ఇష్టం. కానీ హెర్రిక్‌కు మాత్రం ప్రాణం. 29 ఏళ్ల ఈ క్రికెటర్ చిన్నప్పటి నుంచి తాను ఇష్టపడ్డ కార్టూన్లు, యానిమేటెడ్ సినిమాలను టాటూల రూపంలో ఒళ్లంతా పొడిపించుకున్నాడు.

దీనికోసం ఇప్పటిదాకా రూ.12 లక్షలపైనే ఖర్చు చేశాడు. టాటూల కోసం ఇంత ఖర్చు చేస్తావా అని అడిగితే... ‘నేను ఎక్కువగా మందు తాగను. పార్టీల కోసం డబ్బులు తగలేయను. దుబారా ఖర్చు చేయను. ఇవంటే ఇష్టం కాబట్టి ఖర్చుపెడతా’ అంటున్నాడు.
 
సరే ఆయన శరీరం, ఆయనిష్టం. కానీ ఈ టాటూలను అందరికీ చూపించి ముచ్చట పడిపో తాడు. తన పచ్చబొట్లు అన్నీ అందరికీ చూపించేందుకు గాను నగ్నంగా ఫొటోలు దిగి సంచలనం సృష్టించాడు. దీంతో అసలుకే మోసం వచ్చింది. తను నగ్నంగా ఫొటోలు దిగిన తర్వాత చాలామంది హెర్రిక్‌తో మాట్లాడటానికి ఇష్ట పడటం లేదట. కానీ తనతో మాట్లాడితే తానెంత మంచివాడినో తెలుస్తుంది అంటున్నాడు... బిగ్‌బాష్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు ఆడే హెర్రిక్.
 

మరిన్ని వార్తలు