ఈ వారం యూట్యూబ్ హిట్స్

19 Oct, 2015 00:25 IST|Sakshi
ఈ వారం యూట్యూబ్ హిట్స్

బ్లోయింగ్ అప్ మై కిడ్ ప్రాంక్
రోమన్ ఎట్వూడ్ అమెరికన్ యూట్యూబ్ పర్సనాలిటీ. వ్లోగర్. ప్రాంక్‌స్టర్. యాక్టర్. ఫిల్మ్ డెరైక్టర్. రహస్య కెమెరాతో పబ్లిక్ ప్రాంక్ (ఉత్తుత్తి) వీడియోలు తీయడంలో ఎక్స్‌పర్ట్. తాజాగా ఆయన అప్‌లోడ్ చేసిన ‘బ్లోయింగ్ అప్ మై కిడ్’.. యూట్యూబ్ వీక్షకుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అమ్మ, నాన్న, మూడేళ్ల బాబు, రాకాసి లాంటి ఓ పెద్ద ఫోర్ వీలర్ క్వాడ్ బైక్. బాబుకు ఆ బైక్ అంటే ప్రాణం. రైడ్ చెయ్యాలనుకుంటాడు. కానీ తల్లి వారిస్తుంది. ఆమెకు తెలీకుండా తండ్రి ఆ చిన్నారి ఒక్కడినే క్వాడ్ బైక్‌పై కూర్చోబెడతాడు. అది స్టార్ అవుతుంది. తర్వాత ఏమౌతుంది? చూడండి.
 
హేట్ స్టోరీ 3 : ట్రైలర్
రెండ్రోజుల క్రితం టీ సిరీస్ అప్‌లోడ్ చేసిన ఈ హేట్ స్టోరీ 3 కి  హిట్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకో వాలంటే మీరీ వీడియో ట్రైలర్‌ను చూసి తీరాల్సిందే. విశాల్ పాండ్య దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ థ్రిల్లర్ డిసెంబర్ 4న విడుదల అవుతోంది. ఇందులో జరీన్ ఖాన్, డైసీ షా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 1993లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘ఇండీసెంట్ ప్రపోజల్’కు ఇది రీమేక్. విక్రమ్ భట్, మాధురి బెనర్జీ రాసిన హేట్ స్టోరీ 3 కథలో ‘ఇండీసెంట్ ప్రపోజల్’కు భిన్నమైన కథాంశాలు ఏమైనా ఉన్నాయేమో చిత్రం చూస్తే గానీ తెలీదు.
 
ఆడమ్ లెవీన్స్ న్యూ గర్ల్ ఫ్రెండ్
మిలా అనే అమెరికన్ చిన్నారి తన ఫ్యావరెట్ సింగర్ ఆడమ్ లెవిన్‌కు పెళ్లయిపోయిందని తెలియగానే పట్టలేని దుఖంతో ఒక్కసారిగా ఏడ్చేసి, ‘నో.. నో.. హి డిడిన్ట్ మమ్మీ’ అని బాధపడిపోవడం గురించి ఇదే కాలమ్‌లో రెండు వారాల క్రితం మీరు చదివారు. ఇప్పుడీ లేటెస్ట్ వీడియోలో ఆ పాప మళ్లీ కనిపిస్తుంది. పాప, ఆమె తల్లి ‘ఎలన్ షో’కి వస్తారు. అమెరికన్ టీవీలో బాగా పాపులర్ అయిన ఈ సిట్యుయేషనల్ కామెడీ షోలో... హోస్ట్ అలెన్.. తల్లీ కూతుళ్లను ఇంటర్వ్యూ చేస్తారు. చివరలో సర్‌ప్రైజింగ్‌గా ఆడమ్ లెవిన్ ఓ గులాబీ పట్టుకుని ప్రత్యక్షమౌతాడు. తప్పక చూడాల్సిన వీడియో ఇది.
 
మీట్ కోకోస్ న్యూ కిటెన్స్
కోకో అనేది ఒక గొరిల్లా. దానికి బేబీస్ అంటే ఇష్టం. మూతి మీద ముద్దులు పెడుతుంటుంది. అంతిష్టం. పాపం ఆ గొరిల్లాకు పిల్లల్లేవు. అందుకే వేరే వాళ్ల పిల్లల్లి ముద్దు చేస్తుంటుంది. ఈ వీడియోలో గొరిల్లా... పిల్లి పిల్లల్ని మురిపెంగా చూస్తుంటుంది. వాటిని మృదువుగా టచ్ చేస్తుంటుంది. అంతే కాదు, ఆ పిల్లుల్లో ఒకటైన ‘మిస్ గ్రే’ పై ప్రేమను కూడా పెంచుకుంటుంది! దానిని చేతుల్లోకి తీసుకుని, గుండెలకు హత్తుకుంటుంది. అయితే ‘మిస్ బ్లాక్’ అనే పిల్లి పిల్ల కోకోతో ప్రేమలో పడడం ఇందులోని ట్విస్ట్. తర్వాత ఇంకా చాలా కథ ఉంది. సీ అండ్ ఎంజాయ్.
 
డబ్‌స్మాష్ విత్ సెలీనా గోమెజ్

అమెరికన్ నటి, గాయని, ఫ్యాషన్ డిజైనర్ సెలీనా గోమెజ్... డబ్‌స్మాష్ క్వీన్‌గా కూడా తనని తాను రుజువు చేసుకున్నారు. పాపులర్ అయిన మూవీ డైలాగ్స్‌కి అనుగుణంగా పెదవు లను కదపడమే డబ్‌స్మాష్ గేమ్. ఎంతో ఉల్లాసభరితమైన ఈ గేమ్‌ను ఆమె ‘టు నైట్’ షోలో జిమ్మీ ఫెలాన్‌తో కలిసి ఆడారు. గెలిచారు. తన సొంత సింగిల్  హిట్ సాంగ్‌కు ఆమె ఇచ్చిన లిప్ మూవ్‌మెంట్ వీక్షకులను ఆనందడోలికల్లో ముంచెత్తినప్పటికీ అదేమంత కష్టమైన విషయం కాదనీ, ఈ ఆట పూర్తి నిజాయితీగా సాగడం లేదని విమర్శలు వచ్చాయి. ఈ ఆటలో సెలీనాకు దీటుగా జిమ్మీ ఫెలాన్ ఆడలేకపోయారు.
 
సింగ్ : పెంటాటానిక్స్
పెంటాటానిక్స్ (పి.టి.ఎక్స్.) అనేది అమెరికన్ పాప్ బ్యాండ్. ఐదుగురు గాయకులతో (ఇందులో ఒకరు గాయని) 2011లో ఏర్పాటైన ఈ బ్యాండ్.. ‘సి సింగ్ ఆఫ్’ అల్బమ్‌తో ఫామ్‌లోకి వచ్చింది. యువర్ లవ్ ఈజ్ మై డ్రగ్, వీడియో కిల్డ్ రేడియో స్టార్, బార్న్ టు బి వైల్డ్, ఫర్ గెట్ యు, డాగ్ డేస్ ఆర్ ఓవర్, వితౌట్ యు, గివ్ మి జస్ట్ వన్ నైట్, ఐ ఆఫ్ ది టైగర్ వంటి పాటలతో ప్రసిద్ధి చెందింది. తాజాగా పెంటాటానిక్స్ అప్‌లోడ్ చేసిన ‘సింగ్’.. వాటి స్థాయిలోనే పాప్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. వీడియో కలర్‌ఫుల్‌గా ఉంది.

మరిన్ని వార్తలు