ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

19 Jun, 2017 00:53 IST|Sakshi

ఈ రాత్రికి మళ్లీ వస్తాడు హంతకుడు
హ్యాపీ డెత్‌ డే ట్రైలర్‌ నిడివి: 2 ని. 30 సె.
హిట్స్‌ 28,28,694


లో–బడ్జెట్‌ హారర్‌ చిత్రాలను నిర్మించే ‘బ్లూమ్‌హౌస్‌ ప్రొడక్షన్స్‌’ లేటెస్టుగా ‘హ్యాపీ డెత్‌ డే’ అనే హాలీవుడ్‌ మూవీని చిత్రీకరిస్తోంది. ఇది స్లాషర్‌ మూవీ. ట్రైలర్‌ రెండు రోజుల క్రితమే విడుదలైంది. అమ్మాయిల్ని కత్తితో కసాబిసా పొడిచి చంపేసే కథాంశంతో ఉన్న చిత్రాలను స్లాషర్‌ మూవీలు అంటారు. ఇందులో ఇటీవలి ‘లా లా లాండ్‌’ చిత్రం ఫేమ్‌ జెస్సికా రోత్‌ కాలేజ్‌ స్టూడెంట్‌. బర్త్‌డే రోజు రాత్రి జెస్సికాను ఎవరో హత్య చేస్తారు. కత్తితో పొడుస్తుండగా పెద్దగా అరుస్తూ లేస్తుంది. ఇలా ఆమె లైఫ్‌లో రిపీటెడ్‌గా జరుగుతూంటుంది. అది వెంటాడే కల. హంతకుడెవరో తెలుసుకోడానికి ఆ అమ్మాయి గతంలోకి వెళుతుంది.

ఈ ట్రైలర్‌ను చూస్తున్నంత సేపూ మహేశ్‌బాబు సినిమా ‘నేనొక్కడినే’ గుర్తుకు వస్తుంది. ఫస్ట్‌ సీన్‌లో.. మంచం మీద పడుకుని ఉన్న జెస్సికా చప్పుడుకి తలెత్తి చూస్తుంది. ఫోన్‌ రింగ్, డాడీ కాల్‌ అది. అలా ఎస్టాబ్లిష్‌ అయిన జెస్సికా భయం.. ట్రైలర్‌ చివరి వరకు వెంటాడుతూనే ఉంటుంది. ప్రస్తుతానికైతే కథ ఇదే. కథలో కొత్తగా మార్పులు చేయబోతున్నారట. క్రిస్టఫర్‌ లాండన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ‘హ్యాపీ డెత్‌ డే’ అక్టోబర్‌ 13న రిలీజ్‌ అవుతోంది. ఆ రోజు శుక్రవారం! ఫ్రైడే 13 ని ఫారినర్స్‌ చాలామంది పీడ దినంగా భావిస్తారు! ఈ హారర్‌ మూవీకి ఇది మంచి రోజు కావచ్చు. ఎందుకంటే బ్లూమ్‌హౌస్‌ నిర్మించిన వాటిలో రెండు చిత్రాలు.. బాక్సాఫీస్‌ దగ్గర వంద మిలియన్‌ డాలర్లకు పైగా పోగేసుకున్నాయి. ఇది మూడో చిత్రం అవొచ్చు.

సడెన్‌గా కనిపించావు.. కానీ నువ్వు కాదు..!
సెలెనా గోమెజ్‌ బ్యాడ్‌ లయర్‌ నిడివి : 3 ని. 52 సె.
హిట్స్‌ 2,12,21,9993


ఇరవై నాలుగేళ్ల అమెరికన్‌ నటి, గాయని సెలీనా గోమెజ్‌ విడుదల చేసిన కొత్త మ్యూజిక్‌ వీడియో ‘బ్యాడ్‌ లయర్‌’! యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయిన కొన్ని గంటలకే హిట్లు కోట్లు దాటాయి. ఇందులో సెలెనా ఎంత క్యూట్‌గా ఉన్నారంటే.. అబ్బాయిలూ మీరస్సలు కళ్లు తిప్పుకోలేరు. ఇంతవరకు ఆమె చేసిన పాటల్లో ఇది పూర్తిగా పెక్యూలియర్‌. ఒక మేల్‌ టీచర్‌గా, ఒక యంగ్‌ స్టూడెంట్‌గా, ఫ్లర్ట్‌ చేస్తుండే ఇంకొక మేల్‌ టీచర్‌గా, ఆఖరికి ఒక అనుమానపు భార్యగా సెలెనా నాలుగు పాత్రలను పోషించారు.

ఈ వయసులో ఈ పిల్లకింత కష్టం ఏమిటి? కష్టం కాదు, ప్రయోగం అంటోంది సెలెనా. కానీ ఇది ప్రయోగం కాదు, ప్రేమ వైఫల్యం అని ‘బ్యాడ్‌ లయర్‌’ రిలీజ్‌ అయిన వెంటనే కొన్ని కోళ్లు నోరు చేసుకున్నాయి. భర్తని అనుమానించే భార్య పాత్రకు ఫ్లాష్‌బ్యాక్‌.. ఆమెకు, ఆమె ప్రియుడు ‘వీకెండ్‌’ కూ మధ్య జరిగిన నిజ జీవిత ప్రణయ కలహాలేన ట. వీకెండ్‌.. కెనడియన్‌ సాంగ రైటర్‌. అసలు పేరు అబెల్‌ మక్కోనెన్‌ తెస్ఫాయీ. అదలా ఉంచితే, బ్యాడ్‌ లయర్‌లో అతి సున్నితమైన ఉద్వేగాన్ని గాఢాతిగాఢంగా ప్రదర్శించారు సెలెనా. ఆమె ఘాట్‌ రోడ్డు మీద సైకిల్‌ తొక్కుకుంటూ వెళుతుండగా.. ‘ఓ రోజు నేను వీధి వెంబడి నడుచుకుంటూ వెళుతున్నాను.

అప్పుడు నాలో నేను లేను. అదాటున నవ్వు కనిపించావు. ఓఫ్‌.. కానీ నువ్వు కాదు’ అని పాట మొదలౌతుంది. తర్వాత కాలేజ్‌ కారిడార్‌ సీన్‌లో నడుస్తూ సెలెనా ‘ఊవూవూవూవూ’ అని రాగం తియ్యడం మెలోడియస్‌గా ఉంటుంది. ఆ తర్వాత.. ‘నీ గురించి ఆలోచించకుండా ఉండేందుకు నేను ప్రయత్నిస్తున్నాను’ ఓ పచ్చి అబద్ధం చెబుతుంది. పాట చివర్లో కానీ.. అది అబద్ధం అని తెలీదు. ‘ఇఫ్‌ యు ఆర్‌ ద ఆర్ట్‌.. ఐ విల్‌ బి ద బ్రష్‌’ అంటుంది! నా ప్రేమను నీ ఇష్టం వచ్చినట్లు పెయింట్‌ చేసుకో అంటుంది. సెలెనా మాత్రమే కాదు, సాంVŠ  కూడా ఆమెకు దీటుగా లవ్‌లీగా ఉంది.

శ్రద్ధాకపూర్‌.. సిస్టర్‌ ఆఫ్‌ దావూద్‌ ఇబ్రహీం
హసీనా పార్కర్‌ టీజర్‌ నిడివి: 1 ని. 5 సె.
హిట్స్‌ 31,78,771


బ్లాక్‌ ఫ్రైడే, రిస్క్, వన్స్‌ అప్‌ ఆన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై, షూటౌట్‌ ఎట్‌ లఖాండ్‌వాలా, కంపెనీ, డి, డి–డే.. ఇవన్నీ.. మోస్ట్‌ వాంటెడ్‌ అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం మీద వచ్చిన బాలీవుడ్‌ చిత్రాలు. ఇప్పుడు ఆయన చెల్లెలు హసీనా పార్కర్‌ మీద ఆమె పేరుతోనే వస్తున్న బయోపిక్‌ లాంటి చిత్రం ‘హసీనా పార్కర్‌’. ముంౖ»ñ  నాగ్‌పడా లోని ప్రసిద్ధ ‘గోర్డెన్‌ హాల్‌’ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న హసీనా (55) 2014లో రంజాన్‌ ఉపవాసంలో ఉండగా గుండెపోటుతో చనిపోయారు.

హసీనాకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు. కొడుకు డానిష్‌ కొన్నేళ్ల క్రితమే రోడ్‌ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. భర్త ఇబ్రహీం ఇస్మాయిల్‌ పార్కర్‌ 1991లో గ్యాంగ్‌ వార్‌లో చనిపోయాడు. ముంబై నేర ప్రపంచంతో హసీనాకూ సంబంధాలు ఉన్నప్పటికీ ఏనాడూ అరెస్టుకాలేదు! హసీనా బయోపిక్‌లో ఇవన్నీ ఉండొచ్చు. ఉండకపోవచ్చు. ఆమె పాత్రలో శ్రద్ధా కపూర్, దావూద్‌ ఇబ్రహీంగా సిద్ధాంత్‌ కపూర్, హసీనా భర్తగా అంకూర్‌ భాటియా నటిస్తున్నారు. ఆగస్టు 18న మూవీ రిలీజ్‌ అవుతోంది.

నువ్వు చెప్పుకోవలసింది ఏమైనా ఉందా?
డాడీ ట్రైలర్‌ నిడివి: 2 ని. 14 సె.
హిట్స్‌ 53,56,300


1970లలో ముంబైలోని జౌళి మిల్లులు మూత పడ్డాయి. లక్షల మంది కార్మికుల కుటుంబాలు వీధిన పడ్డాయి. ఆకలి, ఆక్రోశం, అరాచకం. దగ్డీ చాల్‌లో ఉండే కార్మికులు మెల్లిగా అండర్‌ వరల్డ్‌ వైపు వెళ్లారు. గ్యాంగ్‌లు ఏర్పరచుకున్నారు. ఆ గ్యాంగ్‌లలో ఖతర్నాక్‌ గ్యాంగ్‌ బి.ఆర్‌.ఎ. ‘బి’ ఫర్‌ బాబు, ‘ఆర్‌’ ఫర్‌ రమ, ‘ఎ’ ఫర్‌ అరుణ్‌. ఈ గ్యాంగ్‌లో అరుణ్‌ డిఫరెంట్‌. అతడి స్టోరీనే ‘డాడీ’ మూవీ.  2012 నాటికి అరుణ్‌ దగ్డీ ‘డాడీ’గా అవతరిస్తాడు. రాజకీయ నాయకుడు అవుతాడు.

లేని వాళ్లకు డాడీ, దోచుకునేవాళ్లకు డెడ్లీ. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వేట ప్రారంభిస్తుంది. ‘నేనిక్కడే ఉంటాను. పారిపోను’ అంటాడు అరుణ్‌. చివరికి చట్టానికి దొరుకుతాడు. ‘నువ్వు చెప్పుకునేదేమైనా ఉందా?’’అని న్యాయస్థానం అడుగుతుంది. ‘నేను నిర్దోషిని’ అంటాడు అరుణ్‌. మూవీ రిలీజ్‌ జూలై 21న. గ్యాంగ్‌స్టర్‌గా ఉండి పొలిటీషియన్‌గా మారిన అరుణ్‌గావ్లీ జీవితం ఇది. ఆశిమ్‌ అహ్లువాలియా డైరెక్టర్‌. అరుణ్‌గా అర్జున్‌ రాంపాల్‌.

మరిన్ని వార్తలు